CM Jagan: అవ్వాతాతలకు జగన్ సర్కార్ న్యూఇయర్ గుడ్ న్యూస్…!!

Share

CM Jagan: రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ లబ్దిదారులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. కొత్త ఏడాది జనవరి 1వ తేదీ నుండి పెన్షన్ మొత్తాన్ని రూ.2500లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం పెన్షన్ దారులకు రూ.2250లు అందిస్తోంది. చాలా కాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు  సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అవ్వాతాతలకు పెన్షన్ రూ.3వేలు చేస్తామని ప్రకటించారు. అయితే  వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి రూ.250 లు చొప్పున నాలుగేళ్లలో రూ.3 వేల వరకు పెంచుతామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా పెన్షన్ పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుండి మరో రూ.250లు కలిపి రూ.2500లు చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం పెన్షన్ పెంపు చేయకున్నా ప్రతి నెలా 1 నుండి 5వ తదీ లోపు వాలంటీర్ల ద్వారా ఇళ్లవద్దనే వృద్ధులకు పెన్షన్లు అందిస్తుండటంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

CM Jagan good news to oap beneficiaries
CM Jagan good news to oap beneficiaries

 

Read More: YCP MLA RK Roja: ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై ఎమ్మెల్యే రోజాతో సహా ప్రయాణీకులు ఫైర్..! ఎందుకంటే..?

CM Jagan: జనవరి 9న ఈబీసీ నేస్తం

కాగా జనవరిలో మరో పథకాన్ని జగన్ సర్కార్ ప్రారంభిస్తోంది. వృద్ధాప్య పెన్షన్ పెంపుతో పాటు జనవరి 9న ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నది జగన్ సర్కార్. ఈ పథకం కింద అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు 45 నుండి 60 సంవత్సరాల లోపు వారికి మూడేళ్లలో రూ.45వేలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద మొదటి విడత రూ.15 వేలు జనవరి 9వ తేదీన అందజేయనున్నారు. అదే విధంగా జనవరిలోనే రైతు భరోసా అమలు చేయనున్నది జగన్ సర్కార్.


Share

Related posts

మళ్లీ యాక్టివ్ అవుతున్న వంగవీటి రాధా..??

sekhar

Nimmagadda ramesh : నిమ్మ‌గ‌డ్డ కొత్త గేమ్ … జ‌గ‌న్ ను భ‌లే ఇరికించేశారు క‌దా?

sridhar

అరియానా పెద్ద సైకో? టార్చర్ పెట్టాలంటే ఆమెకు ఆనందం? రాహుల్ సిప్లిగంజ్ తో మోనల్?

Varun G