ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం .. ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Share

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఏళ్ల తరబడి ప్రమోషన్ లు లేక ఎంపీడీఓలుగా కొనసాగుతున్న వారికి పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్.. ఇప్పుడు తాజాగా మండల సర్వేయర్ లకు తీపి కబురు అందించింది. మండల సర్వేయర్ లకు ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారి ఎన్నో ఏళ్ల కల నెరవేరినట్లు అయ్యింది. రాష్ట్రంలోని 101 మంది మండల సర్వేయర్లకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 

కోర్టు తీర్పులపై ఎవరైనా మాట్లాడవచ్చు కానీ జడ్జిలను టార్గెట్ చేయడం తగదన్న కొత్త సీజేఐ జస్టిస్ లలిత్

ఇప్పటి వరకూ మండల సర్వేయర్‌గా ఉద్యోగంలో చేరిన వారు అందరూ అదే పోస్టులో పదవీ విరమణ అవుతూ వచ్చారు. ఆ శాఖ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు వారిలో పదోన్నతులు లేవు. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది. సరిహద్దు తగాదాల పరిష్కారం, భూసేకరణ, భూరికార్డుల నిర్వహణ కోసం తహసీల్దార్‌ కార్యాలయాలకు ఒక సర్వేయర్‌ చొప్పున నియమితులు అయ్యే వారు. అప్పటి నుంచి ప్రభుత్వ భూ పంపిణీ, భూ యాజమానుల అవసరాలు, ఇళ్ల పట్టాల సర్వే, ప్రాజెక్టులకు భూసేకరణ, పారిశ్రామికీకరణకు భూముల సర్వే, రోడ్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు పెరిగినా సర్వేయర్ల సంఖ్య మాత్రం పెరగలేదు. అయితే వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్వే అవసరాలు, రీ సర్వే కోసం కొత్తగా గ్రామ సచివాలయ వ్యవస్థలో 11,118 గ్రామ సర్వేయర్‌ పోస్టుల నియామకం చేసింది.

టార్గెట్ చంద్రబాబు: కుప్పం వైసీపీ ఇన్ చార్జి భరత్ కు మంత్రి పదవి ఖాయం చేసిన సీఎం వైఎస్ జగన్


Share

Related posts

వర్ల రామయ్య కి వరాలు కురిపించిన చంద్రబాబు ? 

sekhar

pregnant issues: స్త్రీ  పురుషుల్లో తలెత్తే  సంతాన సమస్యలకు కూల్ డ్రింక్స్ కారణమని  మీకు తెలుసా ??

siddhu

Beans: గుప్పెడు గింజలు తింటే ఉబాకయం నుంచి డయాబెటిస్ వరకు చెక్..!

bharani jella