NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

CM Jagan: మోడీకి జగన్ షాక్ ఇవ్వనున్నారా..? పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ స్టాండ్ ఇలా..!!

CM Jagan: ఈ నెల 29వ తేదీ నుండి డిసెంబర్ 23 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడు వైసీపీ పార్లమెంట్ సభ్యులతో సమావేశమైయ్యారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ స్టాండ్ మారిందా..? జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సభ్యులు గతంలో మాదిరిగా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తారా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా, మరో పక్క రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వైసీపీ సహకరిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదంలో వైసీపీ తమ సహకారాన్ని అందిస్తూ వస్తోంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కాకపోయినా వైసీపీ ఆ రీతిలోనే సహకరిస్తున్నది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏమైనా మార్చుకున్నదా ? అన్న సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది.

CM Jagan meeting with ycp mps
CM Jagan meeting with ycp mps

CM Jagan: అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతు ఇచ్చిన బీజేపీ

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా అమరావతి నుండి ప్రారంభమైన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో పూర్తి అయ్యే రాష్ట్రంలోని బీజేపీ నేతలు సంఘీభావం తెలియజేయలేదు. గతంలో అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉందని తీర్మానం చేసినా అమరావతి రైతుల నిరసన కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో అమరావతి రైతుల నిరసన, ఉద్యమాలలో గట్టిగానే మాట్లాడారు. పాల్గొన్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అమరావతి రైతుల ఉద్యమానికి పెద్దగా ఊతం ఇచ్చిన్నట్లు లేదు. అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్భంలో ఈ విషయం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనడంలేదని ప్రస్తావించినట్లు సమాచారం. రైతుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా పాల్గొని సంఘీభావం తెలియజేయాలని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారుట. దీంతో అమరావతి రైతుల మహా పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రారంభం అయిన మొదటి రోజే బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఓ పక్క మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర వైసీపీ నేతలు మంత్రులు ఇది రైతుల పాదయాత్ర కాదనీ, టీడీపీ నడిపిస్తున్న పెయిడ్ వర్కర్స్ పాదయాత్రగా విమర్శస్తున్నారు. రైతుల పాదయాత్రను అధికార వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ వారికి మద్దతుగా పాల్గొనడం, మరో పక్క రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ ను ప్రతి విషయంలోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. దీంతో వైసీపీ తన స్టాండ్ మార్చుకున్నదా ? అన్న సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది.

తాము ఏ కూటమిలో లేము

దానికి తోడు వైసీపీ పార్లమెంట్ సభ్యుల భేటీలో ప్రజా సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నట్లుగా సీఎం వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారని వార్తలు వస్తున్నాయి. సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు దానికి బలం చేకూరుస్తున్నట్లుగా ఉన్నాయి. సీఎం జగన్ తో భేటీ అనంతరం వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని తెలిపారు. సమావేశాల్లో పలు అంశాలపై ఎలా స్పందించాలో సీఎం వైెఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. తాము ఏ కూటమిలో లేమని, తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ చెప్పారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను నిలబెట్టేలా పార్లమెంట్ లో వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు. కేంద్రం ఏపిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు రూ.55వేల కోట్ల ఆమోదం, ఆహార భద్రతా చట్టం ద్వారా ఏపి జరుగుతున్న అన్యాయం, తెలంగాణ నుండి ఏపి ప్రభుత్వానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇలా ఉన్న అనేక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju