NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Narpala (Singanamala):  సీఎం సభను విజయంవంతం చేయండి

Share

Narpala (Singanamala): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 26వ తేదీ (రేపు) శింగనమల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని నార్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రారంభించనున్నారు సీఎం జగన్. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ బొమ్మన శ్రీరామిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మొదటి సారి నియోజకవర్గానికి వస్తున్నందున పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్దంగా ఉండాలని కోరారు.

విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. పేద విద్యార్ధులకు విద్య భారం కాకూడదన్న ఉద్దేశంతో ఎల్ కే జీ నుండి డిగ్రీ వరకూ ప్రభుత్వం ఫీజులు అందిస్తొందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వినడానికి నియోజకవర్గంలోని ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సీఎం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, వైసీపీ మండల కన్వీనర్ పట్నం నాగేష్, సీనియర్ నాయకులు చెన్నకేశవుల యాదవ్, తిరమెల భాస్కరరెడ్డి, జేసిఎస్ మండల కన్వీనర్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


Share

Related posts

RRR – Radhe shyam: ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే ‘రాధే శ్యామ్’..ప్రభాస్ స్కెచ్ అదిరిపోయింది..!

GRK

శ్రీ‌లంక లేదా యూఏఈల‌లో ఐపీఎల్‌..? ఐసీసీ నిర్ణ‌యం కోసం బీసీసీఐ వెయింటింగ్‌..!

Srikanth A

కడప జిల్లాలో ఐటి దాడులు

sarath