NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మైలవరం వైసీపీలో మంత్రి జోగి, ఎమ్మెల్యే వసంత విభేధాలపై సీఎం జగన్ ఏమన్నారంటే..?

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో గత కొంత కాలంగా మంత్రి జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నియోజకవర్గ వైసీపీలోని పరిస్థితి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వద్దకు కూడా వెళ్లింది. గత కొద్ది నెలలుగా వివిధ నియోజకవర్గాల వైసీపీ కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్న సీఎం వైఎస్ జగన్ .. ఈ రోజు మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

CM YS Jagan MLA Vasanta Krishna Prasad

 

ఈ సమావేశంలో నియోజకవర్గంలో ఇప్పటి వరకూ లబ్దిదారులకు అందిన సంక్షేమాన్ని వివరించిన సీఎం జగన్ .. వచ్చే ఎన్నికల్లోనూ గతం కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించి రావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సూచించారు. ఈ సారి మన లక్ష్యం 175 కి 175 స్థానాల్లో విజయం సాధించడమేననీ, దీని కోసం అంతా కృషి చేయాలని అన్నారు. పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు పక్కన బెట్టి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణకృష్ణ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మైలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ తనకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని, తమ వద్ద నుండి కూడా గ్రామాల్లో పరిస్థితిపై సమాచారం తీసుకున్నారని తెలిపారు. తాము చెప్పిన విషయాలు అన్నీ సీఎం జగన్ నమోదు చేసుకున్నారన్నారు.

CM Jagam Meeting With Mylavaram YCP Leaders

 

చిన్న చిన్న విభేదాలు ఉంటే సర్దుకుని గత ఎన్నికల్లో వచ్చిన దాని కంటే ఎక్కువ మెజార్టీలో విజయం సాధించి రావాలని చెప్పారన్నారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకోవాలని సూచించారన్నారు. తన స్థాయిలోనూ కూర్చోబెట్టి మాట్లాడతానని చెప్పారని తెలిపారు. కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయనీ, అన్నీ పరిష్కారం అవుతాయని వసంత ఆశాభావం వ్యక్తం చేసారు. వచ్చే వారంలో కూర్చుంటామనీ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయమే శిరోధార్యమని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మద్య విభేదాలపై స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డే జోక్యం చేసుకోవడంతో మరో వారం రోజుల్లో దీనికి ఏ విధంగా ముగింపు పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!