NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సినిమా టికెట్ల అంశంపై తొలి సారి స్పందించిన సీఎం జగన్..! ఏమన్నారంటే..?

CM YS Jagan: రాష్ట్రంలోని పేదలకు మంచి చేయాలని చూస్తే ప్రతిపక్షాలు వివిధ వ్యవస్థల ద్వారా అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో శనివారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపును సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన సీఎం వైఎస్ జగన్.. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. పెన్షన్ మొత్తాన్ని రూ.2250 నుండి రూ.2500లు చేసి మేనిపెస్టోలోని మరో హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.

CM YS Jagan cinema tickets issue
CM YS Jagan cinema tickets issue

CM YS Jagan: వారికి కొత్త సంవత్సరంలోనైనా జ్ఞానం రావాలి

రాష్ట్రంలో ఇటీవల సినిమా టికెట్ల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. ఈ వేదికపై వైఎస్ జగన్మోహనరెడ్డి సినిమా టికెట్ల అంశంపై మాట్లాడారు. “అమరావతి లో పేదలకు స్థలాలు ఇద్దామని భావిస్తే దానిని న్యాయస్థానాల ద్వారా అడుకున్నారు. అలాగే పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చి వారి చేతిలో లక్షల ఆస్తిని పెడదామంటే దానిని కూడా అడ్డుకున్నారు. పేదలకు ఇంగ్లీషు మీడియం అందిద్దామంటే అడ్డుకున్నారు. చివరకు పేదలకు తగ్గువ ధరకు వినోదం అందించాలని సినిమా టెకెట్ల ధరలను తగ్గిస్తే దానికి కూడా అడ్డుకుంటున్నారు, రాజకీయం చేస్తున్నారు” అని జగన్ విమర్శించారు. ఓర్వలేక విమర్శలు చేస్తున్న వాళ్లందరికీ కొత్త సంవత్సరంలోనైనా జ్ఞానం రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

CM YS Jagan: 31 నెలల్లో పెన్షన్ల పంపిణీకి రూ.41వేల కోట్లు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 39 లక్షల పెన్షన్లు ఉంటే ఇప్పుడు 62 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్న జగన్.. నాడు కేవలం పెన్షన్ ల కోసం రూ.400 కోట్లు ఖర్చు చేయగా, నిన్నటి వరకూ రూ.1450 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఇప్పుడు దాన్ని రూ.1570 కోట్లకు పెంచడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలల్లో పెన్షన్ల పంపిణీకి రూ.41వేల కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా పేద ప్రజల ఇబ్బందులు గమనించి సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగించామని చెప్పారు. అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదేనని జగన్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారన్నారని జగన్ అన్నారు.

Read More: AP Govt: తగ్గేదిలే..! జగన్ మార్క్ కనబడాల్సిందే..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju