ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

Share

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని జగన్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా పేర్కొన్నారు.

 

నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల కూడా మొహర్రం అని చెప్పారు. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని సీఎం జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.


Share

Related posts

Shiv Sena MP Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ..

somaraju sharma

Kuppam Municipal Elections: చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు..! అర్ధరాత్రి టీడీపీ ముఖ్యనేతల అరెస్టు..!!

somaraju sharma

Bimla Nayak: “బీమ్లా నాయక్” నిర్మాతలు సరికొత్త స్ట్రాటజీ..??

sekhar