సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా రైతులకు ట్రాక్టర్ లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ.361.29 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, వంద కంబైన్ హార్వెస్టర్ లు రైతు గ్రూపులకు సీఎం జగన్ పంపిణ చేశారు. అంతే కాకుండా 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం సీఎం జగన్ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూపుల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీని జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమనీ, రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చామన్నారు. అక్టోబర్ లో ఏడు లక్షల మందికి లబ్ది చేకూరేలా యంత్రాలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు రూ.15 లక్షలు కేటాయించామని, రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తున్నామన్నారు. అతి తక్కువ అద్దెతో యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

15 రోజుల ముందుగానే యంత్రాలను బుక్ చేసుకునేలా వైయస్‌ఆర్ యంత్రసేవ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. దేవుడి దయతో మనం చేసే ఈ కార్యక్రమంతో 10,444 ఆర్బీకేల పరిధిలో కూడా ఇక మీదట కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పేరితో ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ యంత్ర పరికరాలు అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకువస్తూ గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెబుతున్నామన్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పై మాజీ మంత్రి పేర్ని సెటైర్లు