CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఓటిఎస్ లబ్దిదారులకు గుడ్ న్యూస్ అందించారు. పేద వర్గాలకు ఎంతో మేలు చేసే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో లాంఛనంగా ప్రారంభించారు. తన పుట్టిన రోజున దాదాపు 50 లక్షలకు పైచిలుకు లబ్దిదారులకు ప్రయోజకం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్న సీఎం జగన్..వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్దికలగాలనే ఈ పథకాన్ని వచ్చే ఏడాది ఉగాది వరకూ పొడిగిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు అమ్ముకోవడానికి, తనఖా పెట్టుకోవడానికి, వారసుల పేర రాయడానికి ఎలాంటి హక్కు లేదనీ, బ్యాంకుల్లో రుణం తీసుకోవడానికీ అవకాశం లేదన్నారు. అటువంటి పరిస్థితి మారుస్తూ పూర్తి హక్కులతో ఇంటిని అమ్ముకునే స్వేచ్చను ఇస్తున్నామని అన్నారు. గతంలో ఉన్న వివాదాలన్నీ పరిష్కరించి వివాదరహితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని తెలిపారు. గృహ హక్కు పథకం ద్వారా రాష్ట్రంలో రూ.16వేల కోట్ల రుణ మాఫీ చేస్తున్నామని చెప్పారు. నామమాత్రపు చెల్లింపులతో లబ్దిదారుల ఇంటిని వారికి సొంతం చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి నిరుపేద ఇంటి యజమాని కావడమే ప్రభుత్వ ధ్వేయమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
పేదల కోసం ఇంత మంచి పథకాన్ని తీసుకువచ్చి అమలు చేస్తుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం జగన్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో వడ్డీ మాఫీ చేయాలని కోరితే ఆ పని చేయకపోగా ఈ రోజు విమర్శించడం సిగ్గుచేటని జగన్ అన్నారు. పేదలకు మంచి జరుగుతుంటే వాళ్లకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఈ 30 నెలల కాలంలో ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా లబ్దిదారులకు వివిధ పథకాల కింద లక్షా 16వేల కోట్లు వాళ్ల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా పేదవారి సొంతింటి కల నెరవేరుస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అనంతరం జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్దిదారులకు సీఎం జగన్ అందజేశారు.
Read More: Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా కీలక వ్యాఖ్యలు..! రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం..!!
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…