NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: పోలవరం ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన

AP Assembly: అసెంబ్లీ సాక్షిగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పదవ రోజైన మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ 2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టును వైఎస్ఆర్ కు అంకితం చేస్తామని ప్రకటించారు. సీడబ్ల్యుసీ నుండి డిజైన్లు వస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని 18నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టును వైఎస్అర్ ప్రారంభించారనీ, ఆయన కొడుగ్గా తానే పూర్తి చేస్తానని స్పష్టం చేశారు.

CM YS Jagan Key statement on polavaram in  AP Assembly
CM YS Jagan Key statement on polavaram in AP Assembly

AP Assembly: పోలవరానికి చంద్రబాబు పనులే శాపం

ఇదే సందర్భంలో పోలవరం ఎత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన రాద్ధాంతంపైనా విమర్శలు గుప్పించారు. పోలవరానికి చంద్రబాబు పనులే శాపంగా మారాయన్నారు. స్పిల్ వే నిర్మాణంలో చంద్రబాబు తప్పులు చేశారనీ ఆరోపించారు. పోలవరం పూర్తి అవుతుంటే చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని అన్నారు. గతంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జోలికి చంద్రబాబు వెళ్లలేదని విమర్శించారు. డిజైన్ ప్రకారం నదిని కుడివైపునకు మళ్లించాలని, అప్పర్, డౌన్ కాఫర్ డ్యాం నిర్మాణ పనుల్లో కొంత వదిలేశారనీ, దీని వల్ల చాలా నష్టం జరిగిందని జగన్ అన్నారు. వరదల వల్ల 10-25 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందనీ, వరద ఉధృతికి డయాఫ్రాం వాల్ బాగా దెబ్బతిన్నదనీ, దీన్ని సరిచేయడానికి రెండేళ్లుగా నిపుణులు ప్రయత్నిస్తున్నారని, ఇదేనా చంద్రబాబు విజయం అని సీఎం ప్రశ్నించారు. పోలవరం ఎత్తు ఇంచ్ కూడా తగ్గదని సీఎం స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్టేనా పోలవరం విషయంలో కేంద్రంతో ఇన్ని సార్లు మాట్లాడటానికి కారణం చంద్రబాబేనన్నారు. చంద్రబాబు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రాజెక్టును తన చేతిల్లోకి తీసుకున్నారని జగన్ విమర్శించారు.

 

 వంద కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు భజన

2017 వరకూ పోలవరం పనులను చంద్రబాబు గాలికి వదిలివేశారన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టడానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టి బస్సుల్లో జనాలను పోలవరం తరలించారని, జయము జయము చంద్రన్న పాటతో ప్రత్యేకంగా భజన సైతం చేయించుకున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఈ సమయంలో జయము జయము చంద్రన్న పాట ప్లే కాగా సభ మొత్తం నవ్వులు పూశాయి. తమ పాలనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మెజార్టీ పనులు పూర్తి చేసినట్లు చెబుతూ పూర్తి వివరాలను సభకు వెల్లడించారు సీఎం జగన్. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని, ఇప్పుడు చేస్తున్న కుట్రలకు వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ చంద్రబాబుకు ఓటమి తప్పదని జగన్ జోస్యం చెప్పారు. వక్రీకరణ, అబద్దాలపై అధారపడి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!