జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ధైర్యంగా ఎదుర్కొని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత గారి జీవితం మనకు ఆదర్శమని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వనితకు, రాష్ట్రంలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు జగన్. వనిత సక్సెస్ జీవనంపై వీడియోను షేర్ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బొమ్మవారిపల్లి గ్రామానికి చెందిన టి వనిత (35) ఒంటరి మహిళ. భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది.

ఆమెకు ఇద్దరు అడపిల్లలు సంతానం. భర్తతో విడిపోయి ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆమె 2019 లో గ్రామ వాలంటీర్ గా ఎంపికైంది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న అమ్మఒడి, జగనన్న తోడు పథకం ద్వారా వచ్చిన డబ్బులతో ఓ ఆవును కొనుగోలు చేసి పాలవ్యాపారం కూడా చేస్తున్నది. అటు వాలంటీర్ గా వచ్చే రూ.5వేల గౌరవ వేతనం, పాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనాన్ని సాగిస్తుంది. తన ఇద్దరు కుమార్తెలను గంగాధర నెల్లూరు హైస్కూల్ లో ఇంగ్లీషు మీడియంలో చేర్పించి చదివిస్తొంది. ఏ దిక్కు తోచని పరిస్థితిలో సీఎం జగనన్న ఓ అన్నలా తోడు ఉండి ఏ వెలుగు లేని తన జీవితంలో వెలుగు నింపారు అంటూ ఆమె సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేసింది.
Political Survey: బాబు ఇలాకాలో జగన్ హవా .. తాజాగా వచ్చిన సర్వేలోనూ అదే లెక్క..!