CM YS Jagan: ఏపిలో రాత్రి పూట కర్ఫ్యూ అమలుపై ప్రభుత్వ నిర్ణయం ఇదీ..

Share

CM YS Jagan: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఇప్పటికి ఓ మోస్తరు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాత్రి 10గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

CM YS Jagan: night curfew extended one week in ap
CM YS Jagan: night curfew extended one week in ap

Read More: TDP: చంద్రబాబుకు మరో షాక్..! నేడు మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ గూటికి..!!

రాష్ట్ర వ్యాప్తంగా సమర్థ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి టీకాలు వేయడం జరిగిందన్నారు. సమర్థ నిర్వహణ వల్ల  దాదాపు 11 లక్షల డోసులను ఆదా చేయగలిగామని పేర్కొన్నారు. అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటి వరకూ 31,796 మందికి టీకాలు వేశామన్నారు.  45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే కోటాను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

కోవిడ్ థర్డ్ వేవ్ పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో  విజయవాడ, విశాఖ, తిరుపతిలలో పిల్లల ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పిహెచ్‌సీలలోనూ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కన్సెంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సబ్ సెంటర్లలో టేలీమెడిసిన్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. థర్త్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ తదితర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Share

Related posts

పవర్ స్టార్ డేట్ ఫిక్స్ చేశాడు ..ఇక న్యూస్ అంతా ఆయన చుట్టూనే ..!

GRK

Tirupati Bypoll : అది అదే.. ఇది ఇదే అంటున్న తిరుపతి బీజేపీ అభ్యర్థి!బాగానే కవర్ చేసుకున్న రత్నప్రభ!

Yandamuri

క‌రోనా రోగి ఉన్న ప్ర‌దేశంలోని గాలితోనూ క‌రోనా వ‌స్తుంది..!

Srikanth A