18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: బటన్ నొక్కి రూ.694 కోట్లు పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్

Share

YS Jagan:  సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) సంక్షేమ పథకాల క్యాలెండర్ ను సక్రమంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకానికి సంబంధించి బటన్ నొక్కుతూనే ఉన్నారు. తాజాగా బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి 11,02 లక్షల మంది విద్యార్ధులకు లబ్దిచేకూరేందుకు రూ.694 కోట్లు నేరుగా బటన్ నొక్కి పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశారు.

AP CM YS Jagan

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రతిపక్షాలు, దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు, ఎల్లో మీడియాపై తన దైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు మంచి బుద్ది ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. అధికారంలో ఉండగా ఏ వర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు ఇవేళ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అని అనుకుంటున్నారని సెటైర్ వేశారు.

YS Jagan Meeting

 

ప్రభుత్వం మంచి చేస్తున్నా చంద్రబాబు అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తొందని జగన్ విమర్శించారు. ప్రజలు ఒక్కటే కొలమానంగా తీసుకోవాలనీ, కుటుంబాల్లో మేలు జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకుని జగనన్నకు తోడుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించాననీ, ఇప్పటికే 98 శాతం హామీలను పూర్తిగా అమలు చేశామని తెలిపారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవారని గుర్తు చేశారు.

YS Jagan: ఈ విషయంలోనూ దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..!


Share

Related posts

జనసేనకు మరో వాత తప్పదా..??

sekhar

ఈసీ × వ్యవస్థ! ఏపీ సంక్షోభం కొత్త సవాల్!!

Comrade CHE

‘ఎవరు ముసలివాల్లో తేల్చుకుందామా!?’

somaraju sharma