NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: అమ్మఒడి డబ్బులు వస్తున్నాయా..! 2022 విద్యాసంవత్సరం నుండి ఈ నిబంధన తప్పదు..!!

CM YS Jagan:  అమ్మఒడి పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ హజరు శాతాన్ని పరిగణలోకి తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగన్ సర్కార్ అమ్మఒడి పథకం నిధులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రారంభంలో 75 శాతం హజరు తప్పనిసరి అని నిబంధన పెట్టింది ప్రభుత్వం. అయితే కరోనా నేపథంలో పాఠశాలలను గత ఏడాది, ఈ ఏడాది మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా గత ఏడాది, ఈ ఏడాది అమ్మఒడి పథకానికి హజరు శాతం నిబంధనను తొలగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. మార్చి చివరి వారంలో కరోనా ప్రారంభం అయింది.

CM YS Jagan review meeting on education department
CM YS Jagan review meeting on education department

Read More: MAA Elections: మా ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్..! నిన్న నాగబాబు..నేడు ప్రకాశ్ రాజ్..! రేపు ఎవరో..?

CM YS Jagan: పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల హజరు శాతం

అమ్మఒడి పథకం అమలు చేసి రెండు మూడు నెలలు తిరగకముందే కరోనా ప్రారంభం కావడంతో పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరిగి 2020 నవంబర్, డిసెంబర్ నెలల్లో పాఠశాలలను తెరవడం జరిగింది. జనవరి 2021లో అమ్మఒడి పథకం నిధుల పంపిణీ జరిగింది. ఆ తరువాత కరోనా సెకండ్ వచ్చింది, దీంతో పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా గడ ఏడాది, ఈ విద్యా సంవత్సరంలో 75 శాతం హజరు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. కాగా ఈ ఏడాది జూన్ లో పాఠశాలలు ప్రారంభించాల్సి ఉండగా ఆగస్టు 16న ప్రారంభించారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలల్లో హజరు శాతం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి ఆగస్టులో 73 శాతం ఉండగా, సెప్టెంబర్ లో 82 శాతంకు పెరిగింది. అక్టోబర్ నెలలో 85 శాతం నమోదు అయ్యింది.

అమ్మఒడి పథకానికి హజరు అనుసంధానం

విద్యాశాఖ పై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించగా ఈ లెక్కలను విద్యాశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో హజరు 91 శాతం ఉందని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ అమ్మఒడి పథకం స్పూర్తి కొనసాగించాలన్నారు. విద్యార్ధులను బడి బాట పట్టించాలన్నదే అమ్మఒడి పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. 2022 విద్యాసంవత్సరంలో అమ్మఒడి పథకానికి హజరుకు అనుసంధానం చేయాలని జగన్ ఆదేశించారు. అమ్మఒడి, విద్యాకానుక రెండు జూన్ లో పిల్లలు స్కూల్‌కి వచ్చేటప్పటికి అందించాలని చెప్పారు. ప్రధానంగా అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి హైస్కూల్ కు క్రీడామైదానం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju