సీఎం జగన్ సెన్పేషన్ నిర్ణయం .. కార్యకర్తలతో వరుస భేటీలు.. ఎమ్మెల్యేలకు వణుకు..!?

Share

రాష్ట్రంలో వైసీపీ ఆధికారంలోకి రావడానికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలనే దానిపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ క్లారిటీతో ఉన్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం పై రివ్యూ నిర్వహిస్తూ ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో అబివృద్ధి పనులకు రూ.20లక్షలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.2కోట్లు ఇస్తామని చెపుతూ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పలువురు సీనియర్ మంత్రులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షులకు చిన్న పాటి క్లాస్ తీసుకున్నారుట. “జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఏమి చేస్తున్నారు.?. కొందరు ఎమ్మెల్యేలు గడప గడపకు సరిగ్గా నిర్వర్తించడం లేదు. పర్యవేక్షించి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులుగా మీకు ఉంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ స్థానంలో వేరే వారికి బాధ్యతలు ఇస్తా, అంతే తప్ప మీరు ఉదాశీనంగా వ్యవహరించవద్దు, మళ్లీ ప్రభుత్వం రావాలంటే ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయాలి. ఎమ్మెల్యేలను పర్యవేక్షిస్తూ మీరు సరిగ్గా పని చేయాలి. నా పని నేను చేస్తా” అంటూ జగన్ సున్నితంగా క్లాస్ పీకినట్లు సమాచారం.

 

అలాగే జగన్మోహనరెడ్డి మరో కొత్త విషయాన్ని చెప్పారు. ఆగస్టు రెండో వారం నుండి ప్రతి నియోజకవర్గంలో 50 మంది సిన్సియర్ కార్యకర్తలను ఎంపిక చేసి ఆ కార్యకర్తలతో భేటీ అవుతాను చెప్పారు. ఇది కొత్త విషయం. ఎందుకంటే .. ఈ మూడు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ లు ఇవ్వలేదన్న అపవాదు ఉంది. దాదాపు 150 మంది ఎమ్మెల్యేల్లో నేరుగా ముఖాముఖి 60 – 70 మంది ఎమ్మెల్యేలకే అవకాశం లభించింది. చాలా మంది ప్రజా ప్రతినిధులు అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్న వారు ఉన్నారుట. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో సిన్సియర్ గా పని చేసే 50 మంది కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడతారుట.

అయితే ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటారా ..? లేక తాను చెప్పాల్సింది చెబుతారా..? అనే డౌట్ అనే చాలా మందిలో ఉంది. కార్యకర్తల కష్టాలు, ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు వారు ఇంట్రెస్ట్ చూపుతారు. పబ్లిక్ మీడింగ్ లలో, నాయకుల సమావేశాల్లో మాట్లాడే మాటలనే జగన్ వల్లె వేస్తే కార్యకర్తలు అంత ఇంట్రెస్ట్ చూపించరు. సిన్సియర్ కార్యకర్తలతో జగన్ మాట్లాడతారు అంటే కొత్త ఉత్సాహం వారిలో ఉంటుంది. చూడాలి ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో..!


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

1 hour ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

4 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago