NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: క‌రోనా క‌ల‌క‌లం స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..

YS Jagan: దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తున్న స‌మ‌యంలో ఏపీలో సైతం అదే రీతిలో ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. రోజువారి పాజిటివ్ కేసులు ప‌ది వేలలు దాటుతున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో RTPCR పరీక్షలు మరింత పెంచడానికి 113టెక్నికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆమోదం తెలిపారు.

 

ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం..

క‌రోనా కట్టడికి తీసుకోవలచిన చర్యలపై ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ జీఓఎం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు మరో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న VRDL కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహణకు సిబ్బంది నియామకానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న VRDL కేంద్రాల్లో RTPCR పరీక్షలు రిపోర్ట్ అతి తక్కువ సమయంలో రావడానికి చర్యలు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్పుడేం జ‌రుగుతుందంటే…

ఏపీలో ప్రస్తుతం RTPCR పరీక్షలు ప్రతి రోజు 40వేలకు పైబడి చేస్తున్నారు. కొత్తగా సిబ్బంది నియామకం వల్ల RTPCR పరీక్షలు రోజుకి 60వేలకు పైబడి చేయడానికి చర్యలు తీసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. ట్రూనాట్ పరీక్షలు గతంలో రోజుకి 10వేలు పరీక్షలు చేసేవాళ్ల‌మ‌ని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని ట్రూనాట్ పరీక్షలు కూడ మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంద‌న్నారు. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షలు కూడ నిర్వహించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రములో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీ, విజయనగరం మహారాజ మెడికల్ కాలేజీల్లో కూడ RTPCR పరీక్షలు నిర్వహిస్తాం అని అన్నారు.

కేసుల క‌ల‌క‌లం…

ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 45,581 శాంపిల్స్ పరీక్షించగా 11,766 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 36 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.. కోవిడ్ బారిన‌ ప‌డి కోవిడ్ వల్ల నెల్లూరు లో ఆరుగురు, చిత్తూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణ లో నలుగురు, కర్నూల్ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నం లో ముగ్గురు, గుంటూరు మరియు విజయనగరం లలో ఇద్దరు చొప్పున మరణించారు.. ఇదే స‌మ‌యంలో 4,441 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009228కు చేర‌గా.. యాక్టివ్ కేసులు 74231 గా ఉన్నాయి.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 927418 క‌రోనా నుంచి కోలుకోగా 7579 మంది ప్రాణాలు కోల్పోయారు.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju