NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ప్రతిపక్షాలపై మరో సారి నిప్పులు చెరిగిన సీఎం వైఎస్ జగన్ .. వారు రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా..?

CM YS Jagan: ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మరో సారి విమర్శనాస్త్రాలు సంధించారు. సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో మంగళవారం జరిగిన  రైతు భీమా విడుదల చేసే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు.  దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. 15.61 లక్షల మంది రైతులకు రూ.2977.92 కోట్లను అందిస్తున్నామన్నారు. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా, ఇవాళ దేవుడి దయ వలల్ నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ప్రజలు తేడా గమనించాలని కోరారు. ఇంతకు ముందు ఇన్సురెన్స్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు బటన్ నొక్కగానే లబ్దిదారుల ఖాతాల్లో భీమా సొమ్ము జమ అవుతోందన్నారు.

CM YS Jagan Slams chandrababu, pawan kalyan
CM YS Jagan Slams chandrababu pawan kalyan

CM YS Jagan: వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అర్హులైనా..?

గత ప్రభుత్వ హయాంలో అయిదేళ్లలో రూ.3,411 కోట్ల పంట భీమా మాత్రమే ఇచ్చారనీ, ఈ మూడేళ్ల హయాంలో రూ.6,685 కోట్ల భీమా చెల్లించామని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే తీర్చిందని అన్నారు. ఇక్కడ అమలు అవుతున్న పథకాల వల్ల దేశం యావత్తు ఏపి వైపు చూస్తొందన్నారు. చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందాన అంటారనీ, వారి అనుకూల మీడియాలు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేస్తారన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు, దత్తపుత్రుడు తోడు దొంగలని, వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అర్హులైనా అని ప్రశ్నించారు సీఎం జగన్.

మార్పును రైతులు గమనించాలి

చంద్రబాబు హయాంలో ఆత్మహత్య లు చేసుకున్న 428 కుటుంబాలకు తమ ప్రభుత్వమే ఆదుకుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో రైతు ఆత్మహత్యలు జరిగితే ఆయన దత్తపుత్రుడికి గుర్తు రాలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఈ ప్రభుత్వం 45వేల కోట్లు ఖర్చు చేస్తున్నామనీ, అయిదేళ్లలో చంద్రబాబు 32వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు.  రైతులను రెచ్చగొట్టి కోనసీమలో క్రాప్ హాలిడే అని ప్రకటించేలా చేశారని ఆరోపించారు సీఎం జగన్.  ఈ మూడేళ్లలో రైతుల కోసం ప్రభుత్వం రూ.1.28 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. గణాంకాలను వివరిస్తూ పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తొందని, ఈ మార్పును రైతులు గమనించాలని కోరారు.

CM YS Jagan: టెన్త్ ఫలితాల్లోనూ రాజకీయాలా..?

పదవ తరగతి ఫలితాలను వీరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు సీఎం జగన్. ఏపిలో 67శాతం మంది విద్యార్ధులు పాస్ అవ్వగా, గజరాత్ రాష్ట్రంలో 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు ఒక నెలలోపే పరీక్ష పెట్టి వారిని పాస్ కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంటే వారిని కూడా కలుషితం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంతో పోటీ పడాల్సిన పిల్లల విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju