NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు.. సంస్మరణ సభలో సీఎం వైఎస్ జగన్ వెల్లడి

CM YS Jagan: దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ నెల్లూరు జిల్లా గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్బంలో గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం వైఎస్ జగన్‌ ఓదార్చారు..

CM YS Jagan speech in condolence meeting of goutham reddy
CM YS Jagan speech in condolence meeting of goutham reddy

Read More: AP BJP: సోము వీర్రాజుకు బిగ్ ట్విస్ట్..! బెజవాడలో బీజేపీ సీనియర్ నేతల భేటీ..మేటర్ ఏమిటంటే..?

CM YS Jagan: గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా..

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. చిన్నప్పటి నుంచి గౌతమ్ రెడ్డితో తనకు ఉన్న పరిచయాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. ప్రతి అడుగులోనూ గౌతమ్‌రెడ్డి తోడుగా ఉన్నారన్నారు. గౌతమ్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉందని అన్నారు. గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. చివరి క్షణం వరకు గౌతమ్ రెడ్డి రాష్ట్రాభివృద్ది కోసం శ్రమించారని జగన్ పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా కార్యక్రమం చేపడతామన్నారు. సంగం బ్యారేజీ పనులు మే 15 లోగా పూర్తి చేసి దానికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేయనున్నట్లు సీఎం జగన్ పునరుద్ఘాటించారు.

 

తొలుత సీఎం జగన్ ఉదయం గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌‌లో నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు వచ్చారు. సంతాప సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి తిరుగుప్రయాణం అయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!