ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పది రోజల పాటు విదేశీ పర్యటన..ఎప్పటి నుండి అంటే..?

Share

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకూ అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా పది రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు. ఈ నెల 20వ తేదీన కుటుంబంతో సహా సీఎం జగన్ స్విట్జర్లాండ్ వెళుతున్నారు. ఈ నెల 22,23,24 తేదీల్లో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం హజరవుతారు. పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం అవుతారు. సదస్సులో ఏపి పెవిలియన్ నిర్వహించే కార్యక్రమాలకు జగన్ హజరు కానున్నట్లు సీఎంఓ తెలిపింది. అనంతరం మే 25 నుండి జగన్ వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు.

CM YS Jagan ten days foreign tour
CM YS Jagan ten days foreign tour

CM YS Jagan: సీఎం జగన్ నేతృత్వంలో ఏపి బృందం

కాగా దావోస్ సమావేశానికి సంబంధించి పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ వివరాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ఏపి బృందం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హజరు కానున్నట్లు తెలిపారు. మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాధ్, ఎంపి మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో వివిధ రంగాల్లో వాణిజ్యం, ఆధునిక నమూనాలు, గ్లోబల్ నెట్ వర్క్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేయడం, నైపుణ్యం, రీస్కిల్లింగ్ వర్క్ ఫోర్స్, తయారీ, గ్లోబల్ ఫోర్ట్ – నేతృత్వంలోని అభివృద్ధి, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఏపి భాగస్వామ్యం ఉంటుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. 18 అంశాల్లో ఏపి ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు.

ఏపి ఇకపై ఫోరమ్ ఫ్లాట్ ఫామ్ పార్టనర్ గా

ఏపి ప్రభుత్వ విధానాలను, ఏపిలోని అవకాశాలను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై ఫోకస్ చేస్తామని చెప్పారు. సదస్సు ముగిసిన తరువాత పెట్టుబడులు తెచ్చేలా కృషి చేస్తామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఏపికి అతిపెద్ద తీరం ఉందనీ, వనరులు ఉన్నాయని ఫోకస్ చేస్తామన్నారు. సుమారు 30 అంతర్జాతీయ కంపెనీలతో సమావేశం అవ్వనున్నట్లు చెప్పారు.  ఇప్పటి వరకూ డబ్ల్యుఈఎఫ్ లో మెంబర్ అసోసియేట్ గా ఉన్న ఏపి ఇకపై ఫోరమ్ ఫ్లాట్ ఫామ్ పార్టనర్ గా చేరనుందని దీనికి సంబంధించి డబ్ల్యుఈఎఫ్ ఫౌండర్ చైర్మన్ ష్వాబ్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు.


Share

Related posts

తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాని సీక్వెల్ చేయబోతున్న మహేష్..??

sekhar

జైలులో ఉన్న స్టార్ హీరోయిన్ హెల్త్ సీరియస్!!! హుటాహుటిన హాస్పిటల్ కి …

Naina

Somu Veerraju : వీర్రాజు గేమ్ ఫ‌లించింది… ప‌వ‌న్ రూట్ మారింది..

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar