YS Jagan: ఏపీలో పీఆర్సీ అంశం ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య పెద్ద నిప్పునే రాజేస్తోంది. ‘ఉద్యోగులకు మేలు చేశాం’ అని ప్రభుత్వం.. ‘ప్రభుత్వం అన్యాయం చేసింది’ అని ఉద్యోగులు తమ వాదన వినిపిస్తున్నారు.. ఎవరి లెక్కలు వారు చూపిస్తున్నారు. మొత్తానికి దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ఆవేశపడి చేసిన ఓ ప్రకటన ప్రస్తుత పరిణామాలకు కూడా ఒక కారణమని చెప్పాలి. ‘ప్రభుత్వాన్ని నిలబెట్టడం, కూల్చడం మా చేతుల్లోనే ఉంది’ అన్న సంఘాల కామెంట్ ను ప్రభుత్వం.. ముఖ్యంగా సీఎం జగన్ సీరియస్ గానే తీసుకున్నట్టున్నారు. అందుకే వారు కోరిన పీఆర్సీతోనే వారికే హీటెక్కిస్తున్నారు. ‘పీఆర్సీ మాకొద్దు మహాప్రభో.. పాత జీతాలే ఇవ్వండి’ అనే స్థాయికి వారిని తీసుకురావడంలో ఒకింత ఘాటు హెచ్చరికే ఇచ్చారు.

ప్రభుత్వం వివరణ ఇదీ..
ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇంతకుమించి చేయలేమని ప్రభుత్వం అంటోంది. (YS Jagan) ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిందలు వేస్తుంటే.. ఉద్యోగులదే తప్పు అని వైసీపీ తన బలమైన సోషల్ మీడియా, వాలంటీర్లు, నేతలు, కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు తమ స్వలాభం కోసం పోరాడుతున్నారని.. తాము రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నామని ప్రజలకు చెప్పి తద్వారా సానుభూతి, లబ్ది పొందాలని వైసీపీ ప్లాన్. ఇప్పటికే ప్రజల్లో ఉద్యోగులపై ఉన్న ఉద్దేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే.. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తే..
చంద్రబాబు అయితే ఇలా..
చంద్రబాబు హయాంలో ఇవే పరిస్థితులు వస్తే.. ఉద్యోగులతో ఎందుకని ఓ మెట్టు దిగుతారు. 2014లో ఉద్యోగులకు తెలంగాణ కంటే ఒక శాతం ఎక్కువ పీఆర్సీనే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. కమిటీలు వేసినా, ముందు బెట్టు చేసినా ఎన్నికల్లో ప్రతికూలత ఉండకూడదని ఉద్యోగులకు అనుకూలంగా వెళ్తారు. కానీ.. ఇక్కడ ఉన్నది సీఎం జగన్. అనుకున్నది చేయడానికి ఎంతవరకైనా వెళ్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పది పరీక్షలు, మూడు రాజధానులు.. అంశమేదైనా.. తన చేయి దాటిపోతేనే రాజీ పడతారు. ఉద్యోగుల తొందరపాటే కావొచ్చు… ప్రభుత్వ నిర్ణయమే కావొచ్చు.. ప్రస్తుతానికి సీఎం (YS Jagan) జగన్.. తగ్గేదేలే..!