NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Harsha Kumar: హర్షకుమార్ హర్ట్ అయ్యారు..రాజకీయ సన్యాసమే..ఎందుకంటే..

Harsha Kumar: ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా గత కొన్ని నెలలుగా క్రియాశీలకంగా పని చేస్తున్న మాజీ ఎంపి హర్షకుమార్ ఆ పార్టీపై అలగారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడుగా గెలిచిన హర్షకుమార్ దళిత సామాజిక వర్గ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ప్రాతినిధ్యం వహించిన అమలాపురం నియోజకవర్గం నుండి హర్షకుమర్ రెండు పర్యాయాలు ఎంపిగా గెలిచారు. అధికార వైసీపీపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్న హర్షకుమార్ ఏపి పీసీసీ రేసులోనూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాలకు స్వస్తి చెబుతూ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

congress Ex Mp Harsha Kumar declared that he was escaping from active politics
congress Ex Mp Harsha Kumar declared that he was escaping from active politics

Harsha Kumar: హర్షకుమార్ హర్ట్ ఎందుకు అయ్యారంటే..

హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చాలా యాక్టివ్ గా ఉండే శ్రీరాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ తరుణంలో శ్రీరాజ్ ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు ఉత్తర్వులు వెలువడించారు. శ్రీరాజ్ చేసిన తప్పు ఏమిటంటే..ఇటీవల ట్విట్టర్ ఇండియా రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేసిన సమయంలో ఓ వీడియోను పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఆ పోస్టును పరిశీలించిన క్రమశిక్షణా సంఘం పార్టీ నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందని నిర్ధారణకు వచ్చి శ్రీరాజ్ పై వేటు వేసింది. దీనిపై హర్షకుమార్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. చేయని తప్పుకు తన కుమారుడికి శిక్ష వేస్తారా అంటూ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజకీయల్లో నుండే తప్పుకోబుతున్నట్లుగా హర్షకుమార్ ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!