congress: తెలంగాణ కాంగ్రెస్ … ఢిల్లీలో ఓ కామెడీ

Share

congress: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూత‌న ర‌థ‌సార‌థి అనే ఎపిసోడ్ అనేక ట్విస్టులు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. గత వారం రోజులుగా కొత్త టీపీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నేతలంతా ఢిల్లీలో మకాం వేశారు. అయితే, అనేక ట్విస్టుల‌తో తాజాగా ఇంకో ప‌రిణామం జ‌రిగింద‌ని అంటున్నారు.

Rea More: Revanth reddy : హ‌మ్మ‌య్య రేవంత్ రెడ్డి కి కొంచెం టెన్ష‌న్ త‌ప్పింది..

నేత‌ల్లో భారీ ఆశ‌
పీసీసీ ఛీప్ ప‌ద‌వికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఎవరికి బాధ్య‌త‌లు అప్పగించాలనే విషయంపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ అది వాయిదా పడుతూ వస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కంటే ముందే కొత్త టీపీసీసీ చీఫ్ నియామకం జరగాల్సి ఉంది. కానీ ఉప ఎన్నికపై కొత్త టీపీసీసీ చీఫ్ ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కొత్త టీపీసీసీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేశారు. ఇటీవ‌ల మ‌ళ్లీ కొత్త నాయ‌కుడి టాక్ వ‌చ్చింది. దీంతో నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. అయితే, నియామక ప్రక్రియ రోజులు గడుస్తున్నా పూర్తి కాక‌పోవడంతో ఢిల్లీకి వెళ్లిన నేతలు తిరిగి ఇంటి బాట పట్టారు.

Read More: Revanth Reddy: టార్గెట్ మార్చుకున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ అవాక్క‌వుతారా?


ఢిల్లీలో నిరాశ‌
ఢిల్లీలో ప‌రిణామాలు అనుకుంటున్న‌ట్లుగా లేవ‌ని కాంగ్రెస్‌ రాజ‌కీయాల గురించి తెలిసిన వారంటున్నారు. ఈ నెల 24న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర ఇంచార్జీలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో ఆన్‌లైన్‌లో సమావేశమవనున్నారు. దేశంలోని ప‌రిణామాలు, అనుకోకుండా మారుతున్న స‌మీక‌ర‌ణాల గురించి ఆమె చర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఓ వైపు ఢిల్లీ పెద్ద‌లు ఈ బిజీలో ఉంటే మ‌న నేత‌లు మాత్రం ప‌ద‌వుల బిజీలో ఉన్నార‌ని పలువురు కామెంట్ చేస్తున్నారు.


Share

Related posts

కరోనా వచ్చిన 80శాతం మందిలో అదే రోగం!

Teja

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య వంట వండితే మామూలుగా ఉండదు?

Varun G

జేసీ కుటుంబం వైసీపీలోకి వస్తే..!? ఏం జరుగుతుందో ఊహించగలరా..!?

Srinivas Manem