Subscribe for notification

పోలీసులు కుక్కలు!! వైసీపీ నాయకుడి అనుచిత వ్యాఖ్యలు

Share

 

ఏ నాయకుడైన ఏ కార్యకర్త అయినా వ్యవస్థలను గౌరవించాలి. అప్పుడే వారికి అందం వ్యవస్థలకు ఇంకా అందం. నిన్న మొన్ననే తాడిపత్రిలో పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన జేసీ బ్రదర్స్ ఘటన మరువకముందే తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ నాయకుడు స్టేజి పైనే సమావేశం సాక్షిగా పోలీసులను కుక్కలు అని సంబోధించడం పెద్ద విషయం అయింది. మైకు చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థల మీద ప్రభుత్వాలకు నాయకులకు ఉన్న గౌరవాన్ని ఎంతో ఏ పాటో నాయకులు తెలియజేస్తున్నారు… వారు వీరు అని కాదు ఏ పార్టీ నాయకులు అయినా సరే వ్యవస్థలో భాగమైన పోలీసుల పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి అసభ్య పదజాలంతో దూషించినంత మాత్రాన హీరోలు అయిపోరు. దానిని గుర్తు పెట్టుకుంటే మంచి రాజకీయాలు… భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం అయ్యే నాయకులు అవుతారు… అయినా కులాల కుమ్ములాట మతాల మద్యం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వ్యాఖ్యలు పెద్ద విషయమే మీ కాదు బ్రదర్… ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రుల బూతులు తిడతారు.. పేకాట ఆడితే ఉరి వేస్తారా అంటూ వ్యవస్థలను ప్రశ్నించవచ్చు..

ఎం జరిగింది అంటే!!

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో బుధవారం ఏర్పాటు చేసిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఓ వైసీపీ నేత కర్రి పాపారాయుడు స్టేజిపై ప్రసంగించారు… మొదట మామూలుగానే మాట్లాడిన ఆయన తర్వాత ఆవేశపడి ఊగిపోయారు. టీడీపీ హయాంలో తాము ఎంతో క్షోభ అనుభవించానని టిడిపి హయాంలో పోలీస్ వ్యవస్థ మొత్తం కుక్కల పని చేసిందంటూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తమపై పోలీసులు ఇష్టానుసారం రౌడీషీట్లు తెరిచి నిత్యం వేధించారని అలాగే కాపు ఉద్యమ సమయంలో తమ ఆడవాళ్ళ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించి తమ ఆత్మగౌరవాన్ని మొత్తం నాశనం చేశారంటూ పాపారాయుడు ఆవేశంతో ఊగిపోయారు. టీడీపీకి పోలీసులు కుక్కల పని చేసింది వాస్తవమని పదేపదే నొక్కి చెబుతూ.. ఇప్పుడు తమ టైం వచ్చింది అంటూ ఆయన లేనిపోనివన్నీ ఎత్తారు.. విషయం ఏమిటంటే అదే వేదికపై మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సైతం ఉన్నారు. వారి సమక్షంలోనే ఓ వైసీపీ నాయకుడు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనం అయ్యింది.

ఆమె లేడీ సింగం!!

ఇళ్ల పట్టాల సభకు బందోబస్తు నిమిత్తం వచ్చిన మండపేట ఎస్ఐ లేడీస్ సింగం గా పేరొందిన మంగాదేవి కర్రి పాపారాయుడు వ్యాఖ్యలకు వెంటనే రియాక్ట్ అయ్యారు… వెంటనే కింద ఉన్న ఆమె వేదికపైకి కర్రి పాపారాయుడు చేతిలోని మైకులు తీసుకొని ఆయనను వారించారు. తాము వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తేనే తప్ప తాము యూనిఫామ్ వేసుకున్నప్పుడు మరేమీ ఆలోచించమని ఆయనకు గట్టిగా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చినా నాయకులు ప్రజాప్రతినిధులు ఏం ఆదేశాలు ఇచ్చినా వాటిని తాము పాటించాల్సిందే అంటూ ఆయన వ్యవస్థ మీద ఉన్న విషయాన్ని చెప్పారు. రౌడీషీట్లు ఎవరు పెడితే వారి మీద ఓపెన్ చేయమని కేసులు తీవ్రమైన కేసులు ఉన్న వారిపై మాత్రమే నమోదు చేస్తామని ఆయన కొన్ని నిబంధనలు చెప్పే ప్రయత్నం ఎస్ఐ మంగాదేవి చేశారు. పాపారాయుడు ఎస్ఐ మధ్య వివాదం తీవ్రం కావడంతో అక్కడే ఉన్న నేతలు కల్పించుకుని ఎస్సై మంగాదేవి కి నచ్చజెప్పి పాపా రాయుడు వద్ద మైక్ లాక్కున్నారు.


Share
Comrade CHE

Recent Posts

Thaman: ఇండస్ట్రీలో ఆ ఇద్దరి హీరోలకు మ్యూజిక్ కొట్టడం చాలా కష్టం అంటున్న తమన్..!!

Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…

21 mins ago

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

1 hour ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

2 hours ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

3 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

5 hours ago