NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Cases: మళ్లీ విజృంభిస్తున్న కరోనా … ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ నిర్ధారణ

Corona Cases: దేశంలో కరోనా మహామ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తొంది. దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకుపైగా చేరుకున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ (Covid Fourth Wave)  ప్రారంభం అయ్యిందా అన్న భయం ప్రజల్లో వెంటాడుతోంది. శుక్రవారం ఉదయం నుండి శనివారం వరకూ 17,092 కొత్త కేసులు నమోదు అయ్యయి. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 14, 684 మంది కోవిడ్ నుండి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివిటీ రేటు 4.14 శాతం గా ఉంది.

Corona Cases increased two ycp mlas tested covid positive
Corona Cases increased two ycp mlas tested covid positive

 

ఇదే క్రమంలో ఏపిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు అధికార వైసీపీలో కరోనా కలకలం రేపింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు కరోనా బారిన పడ్డారు. తాజా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మరో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం వీరు ఇద్దరు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల తమను కలిసిన వాళ్లు అందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 

ఇటీవల కాలం వరకూ పెద్దగా కేసులు నమోదు లేకపోవడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్క్ లు ధరించడం గానీ, భౌతిక దూరం పాటించడం గానీ చేయడం లేదు. వివిద రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు యధావిధిగా జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం అధికార వైసీపీ నేతలు .. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లో తిరుగుతుండగా, టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ఈ తరుణంలో కరోనా కేసులు పెరుగుతుండటం, నేతలు కరోనా బారిన పడుతుండటం కలకలాన్ని రేపుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!