ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Corona: ఏపీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.. మ‌ళ్లీ అదే ప‌రిస్థితా?

Share

Corona:  క‌రోనా థ‌ర్డ్ వేవ్ క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండ‌టం క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. మంగ‌ళ‌వారం 2,498 కరోనా కేసులు నమోదు కాగా, బుధ‌వారం 2,527 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో మరో 19మంది మృతి చెందారు. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,46,749 కి చేరుకుంది.

Read More : Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ లో డేంజ‌ర్ డేస్ ఎప్పుడో తెలుసా?

క‌రోనా ప‌రిస్థితి. ఇది…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 13,197మంది మృతి చెందారు. అటు కరోనా నుంచి కొత్తగా 2,412మంది కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 19,09,613కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,38,636 కరోనా టెస్టులు నిర్వహించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Read More : Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎంత డేంజ‌ర‌స్ అనేది మీరు ఇలా తెలుసుకోవ‌చ్చు!

ఐసీఎంఆర్ స‌ర్వేలో కీల‌క వివ‌రాలు
ఇటీవల జరిగిన జాతీయ సెరో సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశ జనాభాలోని దాదాపు 67% మందిలో కరోనా యాంటీబాడీలు ఉండగా.. మిగిలిన వారు మాత్రం ఇప్పటికీ కరోనా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని వైద్యారోగ్య శాఖ వివరించింది. 6-9 ఏళ్ల కేటగిరిలోని 57.2 శాతం మంది, 10-17 ఏళ్ల కేటగిరిలో 61.6 శాతం మంది చిన్నారుల్లో కరోనా నిరోధక యాంటీబాడీలు ఉన్నట్టు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) సర్వేలో తేలింది. అలాగే 45-60 ఏళ్ల కేటగరిలోని 77.6 మంది, 18-44 ఏళ్ల కేటగిరిలోని 66 శాతం మందిలో కరోనా నిరోధక యాంటీబాడీలు ఉన్నట్టు తమ సర్వేలో తేలిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.


Share

Related posts

డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ మౌనం వెనుక దాగున్న నిజం ఇదేనా.. ?

GRK

బ్రేకింగ్ : సుశాంత్ చావు మరచిపోకముందే మరొక నటుడు సూసైడ్

arun kanna

Deepika Padukone: తెలుగులో ప్రభాస్ తర్వాత అతడే: దీపికా పదుకొణే

Ram