Corona Death: ఓక పర్యయం ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టేసిన కరోనా మహామ్మారి మళ్లీ కొత్త రూపు సంతరించుకుని దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తుంది. ఈ కరోనా బారిన పడి వేలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు,. కళ్ల ముందు రక్త సంబధీకుల ప్రాణాలు పోతున్నా కుటుంబ సభ్యులు రోధించడం తప్ప చేసేది ఏమీ కనబడటం లేదు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడయాలో వైరల్ అయ్యింది. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తుంది.

శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం జగన్నాధవలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు(44) విజయవాడలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం స్వగ్రామానికి వెళ్లారు. అయితే గ్రామస్తులు వారిని ఊరికి దూరంగా ఉన్న పొలాల్లోని షెడ్డులో ఉండాలని సూచించారు. వీరు అక్కడకు చేరుకున్న కొద్ది సేపటికే అసిరినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించి కుప్పకూలిపోయాడు. అతని వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. అతను కొనఊపిరితో కొట్టుమిట్టాతుండగా అతని కుతురు తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా వెళ్లి నాన్నా నాన్నా అంటూ గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ వెంటనే అతను తుదిశ్వాస విడిచాడు. ఆ వ్యక్తి చివరి క్షణంలో అతని భార్య దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నా కూతురు కన్నతండ్రి మీద ప్రేమతో తల్లిని తోసేసి మరీ వెళ్లి గొంతులో నీళ్లు పోయడం, ఆ వెంటనే అతని ప్రాణాలు గాలిలో కలిసి పోవడం చూపరుల హృదయాలను కలచివేస్తుంది. ఈ వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్ అవ్వడంతో తండ్రి పట్ల కుమార్తె చూపిన ప్రేమకు ఇది అద్దం పడుతుందని నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.
