Corona Vaccine: క‌రోనా వ్యాక్సిన్ .. ఓ గుడ్ న్యూస్ .. ఇంకో బ్యాడ్ న్యూస్‌

Share

Corona Vaccine: దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌కలం కొన‌సాగుతోంది. ఇదే స‌మ‌యంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో వ్యాక్సిన్ పై అంద‌రి చూపు ప‌డింది. ఇదే స‌మ‌యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఈ స‌మ‌యంలో ఓ గుడ్ న్యూస్ మ‌రో బ్యాడ్ న్యూస్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

 

అమెరికాలో కీల‌క అప్ డేట్ …

16 ఏళ్లు పైబడిన వారికోసం MRNA టీకాను తయారుచేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ టీకా ఆమోదం కోసం ఫైజర్, బయో ఎన్‌టెక్ సంస్థలు ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నాయి. MRNA టీకాను అందుబాటులోకి తీసుకురావడానికి అనుమతులివ్వాలంటూ అమెరికాలోని ఎఫ్‌డీఏకు సదరు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ అనుమతిస్తే.. 16 నుంచి 45 ఏళ్లలోపు వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే 170 మిలియన్ డోసులు సరఫరా చేసినట్లు కంపెనీలు తెలిపాయి.

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?
Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?

తెలంగాణ స‌ర్కారు ముఖ్య నిర్ణ‌యం

మ‌రోవైపు కరోనా టీకా కొరత కారణంగా రేపటి నుంచి మే 15 వరకు రెండవ డోస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మే 15 వరకు మొదటి డోస్ వ్యాక్సిన్ నిలిపివేయనుంది. మొత్తం 11 లక్షల మందికి రెండవ డోస్ వేయాల్సి ఉందని తెలిపింది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి రెండవ డోస్ వారికి వ్యాక్సిన్ దొరకడం లేదు. దీంతో ఆరోగ్య శాఖ ప్రస్తుతం ఉన్న డోస్ లను రెండవ డోస్ వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : మోనల్ – అఖిల్ లవ్ స్టోరీ పై అఖిల్ నాన్న సంచలన కామెంట్స్ : ఈ మ్యాటర్ తెలిస్తే అఖిల్ ఏమైపోతాడో !

sekhar

Mahesh Babu: ఆతృతగా ఉన్న అభిమానులను నిరాశపరిచిన మహేష్ బాబు…??

sekhar

Chennai Test : చెన్నై టెస్ట్ లో అశ్విన్ సెంచరీ.. సూపర్ ఇన్నింగ్స్ గురూ

bharani jella