Corona Vaccine: గుడ్ న్యూస్ః క‌రోనా వ్యాక్సిన్ ధ‌ర త‌గ్గింది

Share

Corona Vaccine: దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న స‌మ‌యంలో ముఖ్యంగా అంద‌రి చూపు వ్యాక్సిన్‌పై ఉన్న త‌రుణంలో వ్యాక్సిన్ విష‌యంలో గుడ్ న్యూస్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కోవిషీల్డ్ – ఆక్స్ ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భార‌త్‌లో త‌యారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయబోయే కోవిషీల్డ్ ధరలను తగ్గించడానికి అంగీకరించింది.. రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ డోసుకు రూ.300కే అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

మొద‌ట్లో అలా .. ఇప్పుడిలా …

సీరం ఇన్‌స్టిట్యూట్ త‌న వ్యాక్సిన్ విష‌యంలో మొద‌ట్లో డోసును రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రూ.400కు ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు రూ.600కు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. కానీ, ఈ వ్య‌వ‌హారంలో కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో.. వ్యాక్సిన్ ధ‌ర‌లు త‌గ్గించాలంటూ.. సీరంతో పాటు భార‌త్ బ‌యోటెక్‌ను కూడా కేంద్రం కోరింది. దీంతో రాష్ట్రాలకు కోవిషీల్డ్ ధరను 25 శాతం తగ్గించి రూ.300కే డోసును ఇవ్వ‌నున్న‌ట్టు సీరం ప్ర‌క‌టించింది. కేంద్రానికి రూ.150కే డోసును అందించిన సీరం.. రాష్ట్రాల‌కు రూ.300కు ఎలా అమ్ముతుంద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

ఇప్పుడు ఈ నిర్ణ‌యం

మే 1 వ తేదీ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించాల‌ని సీరం ఇన్‌స్టిట్యూట్ ముందుగా నిర్ణ‌యించింది. మే 1 వ తేదీ నుంచి 50శాతం కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 50శాతం ఉత్పత్తిని రాష్ట్ర, ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ ను రూ.400 చొప్పున విక్రయించాలని నిర్ణయించగా, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోస్ ను రూ.600 లకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా ఆ మొత్తాన్ని రూ.300గా ఖ‌రారు చేసింది.


Share

Related posts

టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

somaraju sharma

పూటకొకటి… నోటికొకటి… ఇదీ భా”జపం”…!

somaraju sharma

వైకుంఠ ఏకాదశి.. శ్రీవారి సేవలో ప్రముఖులు

Mahesh