Coronavirus: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే..! నిర్లక్ష్యం తగదు సుమా..!!

Corona Killed: Families Died in Vijayawada Corona
Share

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ వైరస్ వ్యాధి కొత్త లక్షణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో 24 గంటల వ్యవధిలో నమోదు అయిన కేసుల సంఖ్య మూడు లక్షల చేరువ అయ్యింది. రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Coronavirus new symptoms
Coronavirus new symptoms

ఇప్పటి వరకూ జ్వరం, కీళ్ల నొప్పులు, వాసన, రచి కోల్పోవడం లాంటి లక్షణాలు కనబడితే కరోనా సోకినట్లు నిర్ధారణకు వచ్చేవారు కానీ ఇప్పుడు కరోనా వైరస్ కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి లక్షణాలతో పాటు కళ్లు ఎర్రబడటం, కీళ్ల నొప్పులు, మైయాల్జియా, జీర్ణ సంబంధ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కొత్తగా వెలుగుచూస్తున్నాయి. కనుగుడ్ల నుండి కూడా వైరస్ శరీరంలోకి చేరుతుందని పేర్కొంటున్నారు. దీంతో ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా తిరుగుతుండటం వల్ల వైరస్ తీవ్రత మరింత పెరుగుతుందని ఏపి కోవిడ్ -19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ అంటున్నారు. జన్యు మార్పుల ప్రభావం వల్ల వైరస్ సంక్రమణ లక్షణాలు పెరగడంతో శాస్త్రవేత్తలు కొత్త జాబితాను రూపొందించారు.

Coronavirus: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే..

కళ్లు ఎర్రబడడం: కళ్లు ఎర్రబడడం లేదా కండ్ల కలక అనేది అనేక వైరస్ ఇన్ఫెక్షన్లకు సంకేతం. అయితే దీనిలో కళ్లు ఎర్రగా, వాపుగా ఉండడంతో పాటు కంటి నుండి నీరు వస్తుంది. చైనా కు చెందిన ఓ అధ్యయనం ప్రకారం కొత్త స్ట్రెయిన్ వైరస్ బారిన పడిన వారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు మన దేశంలోనూ కరోన పాజిటివ్ నిర్ధారణ అయిన వారి కళ్లు ఎర్రబడడం ఎక్కువగా కనిపిస్తోంది.

జీర్ణ సంబంధిత సమస్యలు: కరోనా వైరస్ ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. విరోచనాలు, వాంతులు, కడుపు తిమ్మిరి, వికారం, నొప్పి అనేది కూడా కరోనా వైరస్ సంకేతాలు. ఎవరికైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

బ్రెయిన్ పనితనం తగ్గడం: జ్ఞపక శక్తి లేదా మెదడుకు సంబంధించిన సమస్యలను కరోనా వైరస్ అధికం చేస్తుంది. గందరగోళంగా ఉండటం లేదా విషయాలను గుర్తించుకోవడంలో ఇబ్బంది ఎదురైతే అది ఖచ్చితంగా కరోనా సమస్యకు సంకేతంగా భావించాలి. ఈ లక్షణాలకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అసాధారణ దగ్గు: కరోనా వైరస్ లక్షణాలలో దగ్గు కూడా ఒకటి. ఆ ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులకు ఒక వేళ దగ్గు వస్తే అది సాధారణ దగ్గుని పోలి ఉండదు. దానికి బిన్నంగా దగ్గు నిరంతరం వస్తూనే ఉంటుంది. అలాగే వారి మాటలోనూ మార్పు ఉంటుంది.

వినికిడి బలహీనత: ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీ ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం కరోనా వినికిడి సమస్యలకు దారి తీస్తుంది. 56 అధ్యయనాలు చేసిన తరువాత కరోనా శ్రవణ, వెస్టిబ్యులర్ వ్యవస్థకి సంబంధించిన సమస్యలను సృష్టించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

సాధారణ లక్షణాలతో పాటు కొత్త లక్షణాలు గమనించినట్లయితే అశ్రద్ద చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్ తో చేతులను తరచు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు  తిరిగి ఇంటికి రాగానే స్నానం చేయడం అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


Share

Related posts

Kesineni Nani : దేవినేని అవినాష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని..!!

sekhar

Children ఈ బిజీ జీవితం లో పిల్లలను సరిగా పట్టించుకోలేక పోతున్నాం అని బాధ పడేవారు మాత్రమే ఇది తెలుసుకోండి!!(పార్ట్-2)

Kumar

ఫ్రీ వైఫై కోసం కన్నకూతురుకు అలాంటి పేరు పెట్టిన తల్లితండ్రులు!

Teja