NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corporate Hospitals Scams: ఆసుపత్రుల బాగోతాలు బట్టబయలు -వణికిస్తున్న విజిలెన్సు..! వరుసగా కేసులు నమోదు..!!

Corporate Hospitals Scams: ప్రభుత్వం ఓ పక్క కరోనా బాధితుల పట్ల కార్పోరేట్ ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహించి వైద్యసేవలు అందించాలని కోరుతోంది.  ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి బాధితుల నుండి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. మరో పక్క విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహకులు దోపిడీకి, అక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రెమిడసివర్ ఇంజక్షన్‌లను బ్లాక్‌ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.

Corporate Hospitals Scams in Andhra Pradesh
Corporate Hospitals Scams in Andhra Pradesh

కరోనా బాధితుల భయాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందించాల్సి పేషంట్స్  వద్ద నుండి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పలు ప్రైవేటు ఆసుపత్రుల అక్రమాల బాగోతం వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల నిర్వహకులు కటకటాల పాలు అవుతున్నారు.

పలు కార్పోరేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిన్న, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని 13 ఆసుపత్రులను తనిఖీ చేశారు. వీటిలో 9 ఆసుపత్రుల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఏడుగురుని అరెస్టు చేశారు.

విశాఖపట్నం ఆదిత్య హాస్పటల్, కాకినాడలోని ఇనోదయ హాస్పిటల్, కేర్ ఎమర్జెన్సీ ఆసుపత్రులకు కోవిడ్ రోగులకు ట్రీట్‌మెంట్ కు అనుమతులు లేకపోయినా పేషంట్స్ ను చేర్చుకుని వైద్యం అందిస్తూ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ అనుమతి ఉన్న పలు కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందించకపోవడం, అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు, ఇంజక్షన్ లు బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు చేయడం లాంటివి అధికారులు గుర్తించారు. ఈ ఆసుపత్రుల నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!