Voluntaries: జగనన్నా చూస్తున్నారా..? వాలంటీర్లకు అవినీతి మరకలు..!!

Share

Voluntaries: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతికి తావులేకుండా అర్హులైన లబ్దిదారులకు అందించేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్ వాలంటీర్ ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి గ్రామంలో, పట్టణంలో 50 నుండి 75 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి కేవలం రూ.5వేల గౌరవ వేతనం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే వేలాది రూపాయలు తీసుకుంటున్న పలు ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులు లంచం తీసుకోకుండా పనులు చేయని పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలిసిందే. ఎక్కడో పాపం పండి, స్థాయికి మంచి లంచం ఇచ్చుకోలేని పరిస్థితిలో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తే వారిని పట్టుకుని కటకటాల పాలు చేస్తున్నారు.

corruption charges on Voluntaries
corruption charges on Voluntaries

Read More: AP Government: పేరెంట్స్ కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! అది ఏమిటంటే..?

దొరికితే దొంగ ..లేకపోతే దొర.. !

దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న చందంగా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల అవినీతిని చూస్తున్న వాలంటీర్లలో కొందరు అదే బాట పడుతున్నారు. వారు వేలల్లో లంచం తీసుకుంటే లేదు కానీ తాము పనులు చేసి వంద రెండు వందలు తీసుకుంటే తప్పు ఏముంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు వాలంటీర్ల  అవినీతి బాగోతాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ప్రతి శాఖలోనూ మంచి, చెడు ఉద్యోగులు ఉన్నట్లుగా వాలంటీర్లలోనూ నిజాయితీగా పని చేసే వారు ఉన్నారు. వారిని ప్రజలు ఆదరిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లుగా విధులు నిర్వహించిన పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులుగా కూడా ఎన్నికైయ్యారు. ఇది వారి పనితీరుకు అద్దం పడుతోంది.

Voluntaries: 267 మంది వాలంటీర్లపై వేటు

ఆ జిల్లాలో ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది వాలంటీర్లు అవినీతికి పాల్పడుతున్నారన్న అభియోగంపై విధుల నుండి తొలగించడం చర్చనీయాంశమవుతుంది. వాలంటీర్ల వ్యవస్థపై అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వాలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వేళ తాము ప్రజల్లోకి రాకపోవడాన్ని ఆసరాగా తీసుకుని అవినీతి కార్యక్రమాలకు తెరలేపాలని ఆయన ఆరోపించారు. అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను తొలగించామని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. అదే విధంగా గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన పది మంది సిబ్బందికి చార్జిమెమోలు జారీ చేశామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో డబ్బులు వసూలు చేస్తే ఊపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వాలంటీర్లకు కష్టానికి తగ్గట్టుగా వేతనాలు అందిస్తే వారు విధులను సక్రమంగా నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది.


Share

Related posts

Huzurabad By Poll: ‘కారు’ ఎక్కుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి..! కౌశిక్ రెడ్డిలో టెన్షన్ స్టార్ట్ అయినట్లేనా..! కేసిఆర్ మనసులో ఏముందో..?

somaraju sharma

TDP: పార్టీలో చంద్రబాబుకి ఊహించని షాక్ ఇస్తున్న యువ నేతలు..!!

Muraliak

పార్లమెంటు సాక్షిగా మోడీని మూడు చెరువుల నీళ్లు తాగించాబోతున్న వైసీపీ ఎంపీలు జగన్ ప్లాన్ ఇదే..??

sekhar