ఏపిలో ఈ నెల 13న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అందరూ ఊహించినట్లుగానే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. మార్చి 13న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది పలితాలు వెల్లడయ్యేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడైయ్యాయి. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా స్వతంత్ర అభ్యర్ధులకు మద్దతు తెలియజేసి టీడీపీ భంగపడింది.

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్ధి నర్తు రామారావు గెలుపొందారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిదిలోని నాలుగు డివిజన్ లో 786 ఓట్లకు గానూ 752 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. వైసీపీ అభ్యర్ధి రామారావుకు 632 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగీన అనేపు రామకృష్ణకు కేవలం 108 ఓటలు మాత్రమే వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల పలితాల్లో రెండు స్థానాలూ వైసీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. వైసీపీ అభ్యర్ధులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు .

జిల్లా వ్యాప్తంగా 1105 ఓట్లు ఉండగా, అందులో 1088 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీకి చెందిన కవురు శ్రీనివాస్ కు 481 మొదటి ప్రాధాన్యత ఓట్లు.. వంకా రవీంద్ర నాథ్ కు 450 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్ధి వీరవల్లి చంద్రశేఖర్ కు 120 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. కర్నూలు జిల్లలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ మధుసూధన్ గెలుపొందారు. మొత్తం 1,136 ఓట్లు పోల్ అవ్వగా, అందులో 53 ఓట్లు చెల్లుబాటు కాలేదు. వైసీపీ అభ్యర్ధికి 988 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్ధులు మోహన్ రెడ్డికి 85, వెంకట వేణుగోపాల్ రెడ్డికి పది ఓట్లు వచ్చాయి.
హైదరాబాద్ లో గంటల వ్యవధిలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు