NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Suicide:  రైల్వే ట్రాక్ పై తలపెట్టి జంట ఆత్మహత్య

Share

Suicide:  ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంభం మండలం సైదాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ పై జంట మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే పట్టాలపై తలపెట్టి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నది ప్రేమికులా లేక భార్యభర్తలా అనేది పోలీసు విచారణలో తేలనున్నది. వీరు ఆత్మహత్య చేసుకునే ముందు కూల్ డ్రింక్, కొబ్బరి నీళ్లు తాగిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు.

Suicide

 

అయితే వీళ్లు కూల్ డ్రింగ్, కొబ్బరి నీళ్లలో ఏమైనా కలుపుకుని తాగి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. మృతులు పెద్దారవీడు మండలం బద్దీడుకు చెందిన వదినా మరుదులు రాములమ్మ, శ్రీనుగా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక మరేదైనా కారణం ఉందా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

YSRCP Again 2024: ట్విట్టర్ ను షేక్ చేస్తున్న వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైన్యం


Share

Related posts

తెల్లజుట్టు నల్లగా మారాలంటే ఈ చిట్కాలను పాటించి చుడండి..!!

Ram

IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

arun kanna

Mekapati Goutham Reddy: నెల్లూరుకు చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధివ దేహం..

somaraju sharma