ఏపిలో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం…సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

Share

 

ఏపిలో రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి భిన్నంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ నిర్ణయాన్ని ప్రభుత్వం, మంత్రులతో పాటు వివిధ అధికార, ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఎన్నికల విధులను బహిష్కరిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిర్ణయం నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరుగనున్నది. ఈ పరిణామాలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 

ఈసీని సవాల్ చేసే అధికారం సీఎంకు లేదని నారాయణ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కూడా తప్పు బట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత కాదనే హక్కు ఎవరికీ ఉండదని అన్నారు. సీఎం జగన్ కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మొదటి నుండి విబేధాలు ఉన్నాయన్నారు నారాయణ. ప్రభుత్వం ఈసితో చర్చలు జరిపాలే కానీ ఘర్షణ పడకూడదని హితవు పలికారు. ఎన్నికల సంఘానికి ఎదురు చెప్పిన ప్రభుత్వాలను తాను ఇప్పటి వరకూ చూడలేదని నారాయణ అన్నారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. విపక్షాలు ఎన్నికల సంఘం తీరును సమర్థిస్తుండగా, అధికార పక్షం ఎన్నికల సంఘాన్ని తూర్పారపడుతోంది. పంచాయతీ ఎన్నికల వ్యవహారం మళ్లీ హైకోర్టు కు చేరడంతో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ఫ్రోగ్రామ్ కూడా ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్నదని కేంద్ర ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల అంశం హాట్ టాపిక్ మారింది.


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

5 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

6 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

58 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago