NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

CPI Narayana Fires On Bigg Boss Show: బిగ్ బాస్ రియాలిటీ షో పై సీపీఐ నేత నారాయణ సీరియస్ కామెంట్స్..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలంటూ..

CPI Narayana Fires On Bigg Boss Show: బిగ్ బాస్ రియాలిటీ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ రియాలిటీ షో నిర్వహణపై ప్రజల నుండి మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ బాగానే ప్రాచుర్యం పొందుతోంది. అయితే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ బిగ్ బాస్ షోల పై తీవ్ర అభ్యంతరం, విమర్శలు చేసిన నారాయణ మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా కల్చర్ ను డామేజ్ చేస్తుందని మండిపడ్డ నారాయణ బిగ్ బాస్ షో ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ షో వల్ల సమాజంలో ఎవరికైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించిన నారాయణ… సమాజంలో విష సంస్కృతిని పెంచుతోందని ఆరోపించారు. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ బాస్ షోలకు ఎలా అనుమతులు ఇస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Narayana Fires On Bigg Boss Show
CPI Narayana Fires On Bigg Boss Show

ఈ షో పేరుతో వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని విమర్శించిన నారాయణ షో చూస్తుంటే కావాలనే కొట్లాటలు, అనైతిక విధానాలతో షో కొనసాగుతోందని విమర్శించారు. గతంలోనూ తాను ఈ షోలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదు కోర్టుకు వెళ్లాలని సూచించారన్నారు. తాను కోర్టుకు వెళ్లినా న్యాయ వ్యవస్థ సాయం చేయలేదన్నారు. పనికి మాలిన ప్రోగ్రామ్ లను అనుమతించడం అనైతికమని అన్నారు. యువతకు, విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని ఈ షోలను సామూహిక బహిష్కరణ చేయాలని పిలుపు నిచ్చారు నారాయణ.

ఇదే క్రమంలో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున పైనా సీరియస్ కామెంట్స్ చేశారు నారాయణ. ఓ వ్యక్తి ముందు ముగ్గురు హీరోయిన్ల ఫోటోలు చూపుతూ నాగార్జున అడిగిన ప్రశ్నలను ఆయన ప్రస్తావిస్తూ.. ఆ ముగ్గురిలో ఎవరితో ముద్దు పెడతావు..ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరితో పెళ్లి చేసుకుంటావు అంటూ అడిగారనీ, అమాయకులు కాబట్టి అలా అడుగుతున్నారని అన్నారు. ఇదే సమయంలో నాగార్జున కుటుంబంలోని వారి ఫోటోలు పెట్టి ఎందుకు అడగరంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇది ఏమి వినోదం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ఓ బూతు ప్రపంచంగా కనిపిస్తోందనీ, పిల్లలను చెడగొడుతున్నారనీ సీరియస్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి షోలకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు నారాయణ. బిగ్ బాస్ షో పై నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నారాయణ చేసిన వ్యాఖ్యలపై బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వహకులు ఏ విధంగా వివరణ ఇస్తారో చూడాలి మరి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju