NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CPI Narayana: రాజద్రోహం చట్టంపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

CPI Narayana: ఇటీవల దేశ వ్యాప్తంగా రాజద్రోహం సెక్షన్ 124 (ఏ)పై విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ల కింద నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్ లపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపినప్పటికీ చివరకు కోర్టుల్లో ఈ కేసులు నిలబడలేదు. ఎక్కువ సందర్భాల్లో ఈ సెక్షన్ కింద నమోదు అయ్యే కేసులు కోర్టుల్లో నిరూపితం కావని తెలిసినప్పటికీ పాలకులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేయడం జరుగుతుంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు కావడం వల్ల తరువాత కేసు సంగతి ఎలా ఉన్నా ముందు నిందితుడు కొద్ది రోజులు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

CPI Narayana serious comments on sec 124(a)
CPI Narayana serious comments on sec 124a

గతంలో ఏపితో సహా పలు రాష్ట్రాల్లో రాజద్రోహం సెక్షన్ కింద కేసులు నమోదు అయినప్పటికీ పెద్దగా దీనిపై దేశ వ్యాప్త చర్చ జరగలేదు. కానీ ఇటీవల ఏపిలో వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు పై రాజద్రోహం సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతో పాటు రెండు మీడియా సంస్థలపైనా నమోదు చేయడం, సదరు మీడియా సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో రాజద్రోహం సెక్షన్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు కూడా ఆ చట్టంపైనే సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం పట్ల ప్రజాస్వామిక వాదులు, జర్నలిస్ట్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజద్రోహం సెక్షన్ పై గతంలో పలు మార్లు అరెస్టు అయిన సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More: AP High Court: అమూల్‌ కు ఏపి హైకోర్టు నోటీసులు..ప్రభుత్వానికి మరో షాక్..!!

ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై విమర్శలు చేసే వారిపై, ప్రజా పోరాటాలు నిర్వహించే ప్రతిపక్షాలు, వామపక్ష మేధావులపై అక్రమంగా బనాయిస్తున్న రాజద్రోహం చట్టం (124 ఏ) ను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులను అణచివేయడానికి ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజా ఉద్యమాల సందర్భంగా తనపై మూడు సార్లు ఈ చట్టాన్ని ప్రయోగించారని నారాయణ గుర్తు చేశారు. తమకు నచ్చని వారితో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాల్గవ స్తంభంగా ఉంటున్న మీడియాపైనా ఈ చట్టం కింద కేసులు నమోదు చేయడం ఆందోళనకరమన్నారు. పాలన వైఫల్యాలపై ప్రతిపక్షాలు, మేధావుల విమర్శలు సహజమని, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు నారాయణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాలం చెల్లిన చట్టాలపై పార్లమెంట్ లో చర్చించి రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N