NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Cradle Ceremony: నయా ట్రెండ్ ఇదీ..! మొన్న కర్నూలులో శునకానికి బర్త్ డే..! నిన్న బందరులో లేగ దూడకు బారసాల వేడుక..!!

Cradle Ceremony: ఇటీవల కాలంలో పెంపుడు జంతువులకు వివిధ రకాల వేడుకలు నిర్వహించడం ఫేషన్ గా మారింది. గతంలో ఇటువంటి వాటిని విడ్డూరం అనే వాళ్లు కానీ నేడు వేడుకగా పెంపుడు జంతువులకు జన్మదిన వేడుకలను నిర్వహించి వాటిపై వారికి ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి పార్టీ చేస్తున్నారు. రెండు నెలల క్రితం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో ఓ రైతు తన పెంపుడు శునకానికి ఘనంగా బర్త్ డే వేడుకను నిర్వహించడం ఆ గ్రామంలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం (బందరు)లో ఓ రైతు కుటుంబం తమ లేగ దూడకు ఘనంగా బారసాల నిర్వహించి దానిపై తమ ప్రేమను చాటుకున్నారు.

Cradle Ceremony for calf in Machilipatnam
Cradle Ceremony for calf in Machilipatnam

Read More: AP CM YS Jagan: ఏపిలో నూతన విద్యావిధానంపై సీఎం జగన్ సమీక్ష..! కీ పాయింట్స్ ఇవే..!!

బందరు బీచ్ రోడ్డులోని డాబాల సెంటర్ లో నివాసం ఉండే ఓ రైతు కుటుంబంలోని ఆవుకు గత నెల 6వ తేదీన ఆడ దూడ జన్మించింది. దీంతో వారు చాలా సంతోషించారు. ఆ లేగ దూడకు తాజాగా బార సాల నిర్వహించారు. అదీ సంప్రదాయ బద్దంగా నిర్వహించడం గమనార్హం. లేగ దూడకు బంగారం అని పేరు పెట్టారు. తమ నివాసంలో ఉయ్యాల కట్టి పూలతో అలంకరించారు. ఉయ్యాలలో దూడను ఉంచి హారతులు పట్టి, పాటలు పాడారు. గోపూజ నిర్వహించి ముత్తైదువులకు వాయినాలు సమర్పించుకున్నారు.

Cradle Ceremony for calf in Machilipatnam
Cradle Ceremony for calf in Machilipatnam

బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని పిలిచి భోజనాలు ఏర్పాటు చేశారు. వీరు వారి గోవు గర్భిణిగా ఉన్న సమయంలో సీమంతం కూడా చేశారుట. ఇంతకు ముందు పట్టణాల్లో ఖరీదైన ఆల్ సేషన్ డాగ్స్ పెంచుకునే ధనవంతులు వారి ఇళ్లల్లో నిరాడంబరంగా వాటి బర్త్ డే వేడుకలను జరుపుకునే వారు. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ వారు ఆప్యాయంగా పెంచుకునే మూగ జీవాలకు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండటం నయా ట్రెండ్ అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju