NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Govt: ఆర్ధిక మంత్రి గారూ.. విపక్షాల ఆరోపణల్లో నిజమెంత..?

criticism on minister buggana rajendranath

AP Govt: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎన్నో వ్యాఖ్యలు.. ఎందరో అనలైజ్ చేస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్నా సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారని.. ఎఫ్ఆర్ఎంబీ లిమిట్ దాటిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు.. ప్రభుత్వం అప్పులు చేస్తున్నామంటూనే.. పరిస్థితి అదుపులోనే ఉందని అంటోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా సమయంలో కూడా తమ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. బుగ్గన ప్రకటనపై పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. ఆర్ధిక మంత్రి ప్రకటన.. తమకు తామ ఆశీర్వదించుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాష్ట్ర ఆర్దిక పరిస్దితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు.

criticism on minister buggana rajendranath
criticism on minister buggana rajendranath

ప్రతిపక్షాల ఆరోపణలు..

‘బుగ్గన చెప్పే లెక్కలు చూస్తే ఆర్దిక శాస్త్రం రాసిన చాణ్యుకుడు కూడ నివ్వెరపోతాడు. ఒక ప్రభుత్వాన్ని ఆర్థికంగా పతనం చేయోచ్చనేది మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది. ఒకసారి కరోనా ఉన్నా అద్బుతంగా చేశామని.. మరోసారి కరోనాతో ఆదాయం తగ్గింది అంటారు.. ఏది నిజం? నిజాలు చెబితే మీ తల వేయి ముక్కల అవుతుందనే మీకేదో శాపం ఉన్నట్టుంది. అందుకే.. అబద్దాలు చెబుతున్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత? చేస్తున్న మూల ధన వ్యయం ఎంత? సంక్షేమానికి ఖర్చు చేస్తున్నదెంత? జీతాల కోసం ఎంత ఖర్చు..? మీ దుబారాకు ఖర్చెంత..? కొన్ని పధకాలకు అయ్యే  ఖర్చుకంటే ప్రకటనల ఖర్చే ఎక్కువగా ఉంటోందనేది నిజం కాదా..? వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మాయ లెక్కలు చెప్పడానికి సిద్దమవుతున్నారు’ అని అన్నారు.

నిజానిజాలెంత..

టీడీపీ గత హయాంలో ఇప్పుడు పయ్యావుల ఉన్న పీఏసీ చైర్మన్ హోదాలోనే బుగ్గన ఉన్నారు. ప్రభుత్వ ఖర్చులు, రాబడి, వ్యయాలు.. ఆయనకు తెలుసు. టీడీపీ ప్రభుత్వాన్ని బుగ్గన ఇలానే విమర్శించారు. కానీ.. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల అమలుకు బుగ్గన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెలా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రానికి సాయం చేయమని కోరుతూంటారని.. పయ్యావుల కేశవ్, ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ, బీజేపీ నుంచి సోము వీర్రాజు విమర్శిస్తూంటారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు, అప్పులపై ప్రశ్నిస్తూనే ఉంటారు. నిప్పు లేనిదే పొగ రాదనే సామెతలా.. వీరంతా ఆరోపిస్తున్నట్టు రాష్ట్ర ఆర్ధికశాఖ పరిస్థితిపై నిజమేంటో.. బుగ్గనకే తెలియాలి.

author avatar
Muraliak

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju