NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Cyclone Michaung:  తరుముకొస్తున్న మిచౌంగ్ .. గంటకు 90 నుండి 110 కి.మీ వేగంతో ఈదురు గాలులు

Cyclone Michaung:  మిచౌంగ్ తుఫాను తరుముకొస్తొంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 210 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుఫాను కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుండి 110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుఫాను కదులుతోందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. కొంత భాగం సముద్రంలో.. మరి కొంత భూమిపై ఉన్నట్లు వెల్లడించింది. గడచిన ఆరు గంటలుగా గంటకు ఏడు కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా తుఫాను కదులుతున్నట్లు తెలిపింది.

మిచౌంగ్ ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ. మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తొంది. విజయవాడతో పాటు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజానీకాన్ని పునరావాస కేంద్రాలకు తరలించారు.

మిచౌంగ్ కారణంగా నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని తొమ్మిది మండలాల్లో భారీ వర్షం కురుస్తొంది. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లు ను టీటీడీ అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరద నీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా ..ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం, గాలుల తీవ్రతకు పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో దాదాపు 15 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

గాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో భారీ చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షం, ఈదురు గాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం కలిగింది. తుఫాను కారణంగా విశాఖలో బీచ్ లు మూసివేశారు. ఆర్కే బీచ్ లో పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అన్ని బీచ్ లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పర్యాటకులు బీచ్ లోకి దిగకుండా ఆంక్షలు విధించారు.

Telangana Congress: దిశదిన గండం నూరేళ్ల ఆయుష్షే(నా)..! మాజీ మంత్రి కడియం సంచలన కామెంట్స్

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju