Daggubati Venkateswara Rao: టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు పెద్ద అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుండెపోటుతో అస్వస్థతకు గురైయ్యారు. మంగళవారం ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఛాతినొప్పితో బాధపడుతుండగా వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావును పరీక్షించిన వైద్యులు ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా గుర్తించి వెంటనే గుండెకు స్టెంట్ వేశారు. దీంతో ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత, దగ్గుబాటి తోడల్లుడు నారా చంద్రబాబు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి వెళ్లి దగ్గుబాటి వెంకటేశ్వరరావును పరామర్శించారు. దగ్గుపాటి ఆరోగ్యంపై చంద్రబాబు అపోలో ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో స్టెంట్ అమర్చామనీ, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చంద్రబాబుకు వివరించారు. నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ఆసుపత్రికి వెళ్లి దగ్గుబాటి వెంకటేశ్వరరావును పరామర్శించినట్లు సమాచారం.
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…
Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…