ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పెద్ద అల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం కొద్ది నెలల పాటు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పార్టీ నుండి తప్పుకుని సైలెంట్ గా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆయన కుమారుడు దుగ్గుబాటి హితేష్ ను తన రాజకీయ వారసుడుగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారనీ, మరల టీడీపీలో చేరి తన కుమారుడిని పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయనీ కొద్ది కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు నేను, నా కుమారుడు హితేష్ స్వస్తి చెబుతున్నామని స్పష్టం చేశారు దగ్గుబాటి. ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో తాము ఇమడలేమని పేర్కొన్నారు. డబ్బుతో నడిచే రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయనీ, మనసు చంపుకొని పని చేయలేమని దగ్గుబాటి.అన్నారు. ప్రజా సేవ చేయాలనుకుంటే పదవులు లేకున్నా సొంతంగా చేస్తామని అన్నారు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవని వ్యాఖ్యానించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ వేదికపై దగ్గుబాటి ఈ కీలక ప్రకటన చేశారు. ఇంకొల్లు తో తనకు ఉన్న అనుబంధంతో ఇక్కడ తన మనసులోని మాట చెప్పానని అన్నారు దగ్గుబాటి. గతంలో రాజకీయాలకు నేటి రాజకీయాలకు పొంతన లేదని, అందుకే హితేష్, తాను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నామని వెల్లడించారు. అయితే దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు.
టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చురు నియోజకవర్గం నుండి 1984, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1991 లో టీడీపీ అభ్యర్దిగా బాపట్ల లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. 1995లో టీడీపీ చీలిక సమయంలో ఎన్టీఆర్ ను విభేదించి చంద్రబాబు పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక కావడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత 1996లో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైయ్యారు. ఆ తర్వాత తోడల్లుడు చంద్రబాబుతో వచ్చిన విభేదాల నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2004, 2009 ఎన్నికల్లో పర్చురు అసెంబ్లీ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పర్చూరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
Breaking: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం .. 40 మందికి పైగా మృతి.. విమానంలో అయిదుగురు భారతీయులు