ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవకు స్వల్ప ఊరట లభించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు 15 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉందని తెలియజేస్తూ బెయిల్ కోసం రాఘవ హైకోర్టును ఆశ్రయించగా, దర్మాసనం నేడు బెయిల్ మంజూరు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ .. రాఘవను ఈ ఏడాది ఫిబ్రవరి 10న అరెస్టు చేసింది. తదుపరి కోర్టు అనుమతితో పది రోజులు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ఆయనను విచారించారు. కాగా, సౌత్ గ్రూపు తరపున చెల్లించిన వంద కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర ఉందనీ, ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ కేసులో ఇటీవలే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ లభించింది.
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనపై మరో సారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్