Kruttivennu (Krishna): కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో గ్రామ దేవత దేశమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఈ జాతర మహోత్సవాల్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ దేవత దేశమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని పాల్గొన్న నేతలు అకాక్షించారు.
తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ చార్జి కాగిత కృష్ణ ప్రసాద్ కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు మజ్జిగ అందజేశారు. ఆయన వెంట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రత్తయ్య, నిడమర్రు మాజీ నీటి సంఘం అధ్యక్షులు బొర్రా ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?