Subscribe for notification

Divyavani Resign: చంద్రబాబుకు దివ్యవాణి రాజీనామా లేఖ.. మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు

Share

Divyavani Resign: తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పార్టీ అధికార ప్రతినిధి పదవికి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. అయితే ఈ లేఖలో మాత్రం తన వ్యక్తిగత కారణాలు అని పేర్కొన్న దివ్యవాణి.. మీడియా సమావేశంలో పరోక్షంగా బాబు కోటరీపైన విమర్శలు గుప్పించారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు దివ్యవాణి. ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి తర్వాత దాన్ని ఆమె డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దివ్యవాణి బుధవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అవ్వడం, ఆ తరువాత కొద్దిసేపటికే తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వీడియో సందేశం ఇవ్వడం తెలిసిందే.

Divyavani Resign Telugu Desam Party

Divyavani Resign: అవమానాలు తట్టుకోలేకే

గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితులను వివరించారు దివ్యవాణి. కొంత కాలంగా పార్టీ కేడర్ తనను అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతూ వస్తున్నారని, పార్టీలో అవమానాలకు తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశం పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుకుంటున్నారని దివ్యవాణి ఆరోపించారు. ఓ దశలో దివ్యవాణి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన లాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారనీ, కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి అలా ఉంటున్నారని దివ్యవాణి అన్నారు. చంద్రబాబు తనను విసుక్కున్నా తాను బాధపడటం లేదన్న దివ్యవాణి.. ఆయన తన తండ్రి లాంటి వారని అన్నారు.  చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు, ఇదే మాటలను అప్పుడు ఇప్పుడు ఎప్పూడూ చెబుతాను అన్న దివ్యవాణి.. బాబు వద్దే క్లారిటీ తీసుకుందామనే ఉద్దేశంతో తాను ఇన్నాళ్లూ పార్టీ నుండి బయటకు రాకుండా నిరీక్షించానని చెప్పుకొచ్చారు.

 

గౌరవం లేని చోట ఉండలేను

బుధవారం చంద్రబాబును కలిసేందుకు వెళితే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని అవేదన వ్యక్తం చేశారు.  ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడూ తనపై కక్ష సాధింపులకు పాల్పడలేదని అన్నారు. దివ్యవాణి తన కుటుంబంపై ఎవరైనా ఒక మాట అంటే పట్టించుకోదు కానీ చంద్రబాబును ఎవరైనా ఒక మాట అంటే అంతరంగంలో నుండి మాట్లాడుతుందనే భావన తన గురించి టీడీపీలో ఉందన్నారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే..అందరికంటే ముందు తానే కౌంటర్ ఇచ్చానని గుర్తు చేశారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండే ఏపికి వస్తున్నారు, తాను హైదరాబాద్ లో ఉండే వస్తున్నానని అన్నారు. గౌరవం లేని చోట ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. ఒక సందర్బంలో పార్టీ కార్యాలయ గేటు వద్దే నిలువరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా టీడీ జనార్థన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి. చంద్రబాబును ఉద్దేశించి తాను కామెంట్లు చేయడం లేదని అన్నారు దివ్యవాణి. సినీ రంగంలో బాలకృష్ణ కంటే తానే పెద్ద నటినని పేర్కొన్నారు.  టీడీపీ నుండి బయటకు వచ్చిన జయప్రద, జయసుధ, ఆలీ, రోజా పేర్లను ప్రస్తావిస్తూ ఇప్పడు తన వంతు వచ్చినట్లుగా దివ్యవాణి చెప్పుకొచ్చారు.


Share
somaraju sharma

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

51 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

1 hour ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

5 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

5 hours ago