NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు ఆరోగ్యంపై బయటకు వచ్చిన వైద్యుల కీలక నివేదిక .. వైద్యులు ఏమంటున్నారంటే..?  

Share

Chandrababu Arrest: రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబందించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన కీలక నివేదిక బయటకు వచ్చింది. జైల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా నివేదిక ఉండటంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలర్జీ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు జీజీహెచ్ సూపర్నిటెండెంట్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి 5.30 గంటల వరకూ డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ వి సునీత దేవి లతో కూడిన వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షించి జైలు అధికారులకు నివేదిక అందజేసింది. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వివిధ రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారు.

కాగా, ఇవేళ చంద్రబాబుతో నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంలో నారా లోకేష్ .. జైళ్ల శాఖ డీఐజీ, ఇన్ చార్జి జైలు సూపర్నిటెండెంట్ రవికిరణ్ ను వైద్యుల నివేదికపై ప్రశ్నించినట్లు తెలుస్తొంది. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యుల నివేదికలో స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారుట. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలని వైద్యులు సూచిస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత లోకేష్, భువనేశ్వరిలు మీడియాతో మాట్లాడకుండానే అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆందోళన కారణంగానే వారు మీడియాతో మాట్లాడలేదని టీడీపీ నేతలు అంటున్నారు.

మరోపక్క చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మరో సారి జైళ్ల శాఖ డీఐడీ రవికిరణ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. చంద్రబాబు ను పరీక్షించిన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబుకు కేవలం చర్మ సంబంధిత సమస్య మాత్రమే ఉందని ఆయనను పరీక్షించిన వైద్యులు తెలిపారు.   చంద్రబాబు తమతో చాలా యాక్టివ్ గా మాట్లాడారని వైద్యులు అన్నారు. చంద్రబాబును బయటి ఆసుపత్రికి పంపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బరువు ఏమీ తగ్గలేదని చెప్పారు. చంద్రబాబుకు అన్ని రకాల పరీక్షలు చేశామని వెల్లడించారు. తాము చెప్పిన మెడికేషన్ చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో సంప్రదించిన తర్వాతే వాడుతున్నారని డాక్టర్ శివకుమార్ తెలిపారు.

చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్ ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. వైద్యుల బృందం ఇచ్చే నివేదికను కోర్టుకు సమర్పిస్తామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. చంద్రబాబు పట్ల ఎటువంటి నిర్లక్ష్యం లేదని చెప్పారు. 24 గంటలు చంద్రబాబుకు తమ అధికారులు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. డెర్మటాలజిస్ట్ పరీక్షించి కొన్ని రికమండేషన్స్ చేశారనీ, నిబంధనల ప్రకారం తాము చేసే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రోటోకాల్ ప్రకారమే అందరితో నడుచుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనర్ అని అందుకే అత్యుత్తమ డాక్టర్ల బృందం అందుబాటులో ఉందని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు.

IND vs PAK: అదరగొట్టిన భారత బౌలర్లు .. పాకిస్థాన్ ఆలౌట్

 


Share

Related posts

బిగ్ బాస్ 4: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ అతనిపై బిగ్ బాంబ్ వేసిన లాస్య..!!

sekhar

ఫిబ్రవరి 4 నుండి జగన్ సమర శంఖారావం

somaraju sharma

Munugodu Bypoll: మునుగోడులో కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓటింగ్

somaraju sharma