NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : ష‌ర్మిల కొత్త పార్టీ భ‌విష్య‌త్తు … కేసీఆర్ లెక్క త‌ప్పుతుందా?

AP Politics : News Strategy in Politics

YS Sharmila : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల ఉత్కంఠ‌కు తెర‌దించుతూ, కొత్త పార్టీ గురించి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్య పాలన అవసరం ఉందని వైఎస్ షర్మిల ప్ర‌క‌టించారు. కొత్త పార్టీ గురించి ఆమె లోటస్‌పాండ్‌లో మాట్లాడుతూ… అన్ని జిల్లాల నేతల అభిప్రాయం తీసుకుంటున్నానని..సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తానన్నారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ష‌ర్మిల రాజ‌కీయ ఎంట్రీ గురించి ఎలాంటి అంచ‌నాల‌తో ఉన్నార‌నే టాక్ ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారింది.

does-ys-sharmila-steps-will-effect-kcr
does-ys-sharmila-steps-will-effect-kcr

YS Sharmila ష‌ర్మిల ఏం చెప్పారు ?

తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని రాజ‌న్మ రాజ్య‌మే త‌మ నినాద‌మని ఆమె ప్ర‌క‌టించారు. నల్గొండ జిల్లా నాయకుల అభిప్రాయం తీసుకున్నట్లు చెప్పిన ష‌ర్మిల జిల్లా నేతల నుంచి మంచి స్పందన వచ్చిందని.. రాబోయే సమావేశాలు జిల్లాలోనే ఉంటాయన్నారు. నల్గొండ ఉపఎన్నికల్లో పోటీ చేయబోమని తెలిపిన షర్మిల.. జగన్మోహన్ రెడ్డి నేను వేరు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పని ఆయనది త‌న పని త‌నది అన్నారు. పాదయాత్రపై స్పందించని వైఎస్ షర్మిల..పార్టీ పెట్టడంపై, త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానన్నారు.

కేసీఆర్ కు క్లారిటీ ఉందా?

టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణలో కొత్త పార్టీ అనే విషయం మీద కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు గుర్తు చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదని అన్నారు. పార్టీ అంటే పాటలు పాడటం.. పాన్ షాప్ పెట్టడం కాదంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలంటే దానికి బలమైన నిర్మాణం కావాలని పార్టీ ముందుకెళ్లడానికి తగిన వ్యూహం కూడా ఉండాలన్నారు.

అంతే కాక గత 20 ఏళ్లలో 14 పార్టీలు వచ్చిపోయిన సంగతిని కూడా కేసీఆర్ సమావేశంలో పేర్కొన్నారు. దేవేందర్‌గౌడ్‌, విజయ శాంతి, చిరంజీవి, జయప్రకాశ్ నారాయణ, కోదండరాం లాంటి వాళ్లు పార్టీలు పెట్టినా.. వాటి ఆనవాళ్లు లేవన్నారు. చెన్నారెడ్డి లాంటి నేత తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి 11 ఎంపీ స్థానాలు గెలిచినా.. ఇందిరాగాంధీ ధాటికి తట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీ ఆర్ వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది షర్మిల పార్టీ గురించేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, ష‌ర్మిల త‌న రాజ‌కీయ రీ ఎంట్రీ గురించి అధికారికంగా చెప్పిన నేప‌థ్యంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తార‌నే ఉత్కంఠ ఇప్పుడు అంద‌రిలోనూ నెల‌కొంది.

author avatar
sridhar

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!