Drinking water Contamination: కలుషిత నీటి కారణంగా కంభంపాడులో 20 మంది అస్వస్థత..!!

Share

Drinking water Contamination: కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో కలుషిత మంచినీటి కారణంగా 20 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గత రాత్రి నుండి సుమారు 20 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య సేవలు అందించారు.

Drinking water Contamination: 20 persons illness
Drinking water Contamination: 20 persons illness

గ్రామంలో గల పాత మంచినీటి బావి నుండి ఓవర్ హెడ్ ట్యాంకుకు నీరు ఎక్కించి గ్రామంలోని కొంత ప్రాంతానికి సరఫరా చేస్తుంటారు. గ్రామస్తులు ఆ ట్యాంకు నుండి సరఫరా అయ్యే నీటిని సేవిస్తుంటారు. అయితే ఈ మంచినీరు ఏమైనా కలుషితం అయ్యిందా అనే విషయాలపై అధికారులు మంచినీటి సాంపిల్స్ తీసి పరీక్షలు నిమిత్తం పంపించారు. రెండు రోజుల పాటు ఆ ట్యాంకు నీళ్లు త్రాగవద్దని గ్రామస్తులకు వైద్య ఆరోగ్య శాఖ అధకారులు సూచించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.


Share

Related posts

బ్రేకింగ్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెం 1

Vihari

ఆదిపురుష్ , సలార్ కంటే ప్రభాస్ ఫాన్స్ కి పెద్ద గుడ్ న్యూస్ !!

Naina

కరోనా నిరోదకం పై రెండు రాష్ట్రాల సిఏం లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినా మోడీ

Siva Prasad