NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఈసీ × వ్యవస్థ! ఏపీ సంక్షోభం కొత్త సవాల్!!

 

 

రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షోభం స్వతంత్ర భారతదేశంలో కొత్తది. ఇప్పటి వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇంతగా ఫైట్ చేసింది లేదు. కొన్ని అరమరికలు వచ్చినప్పటికీ తర్వాత మధ్యవర్తులు రాజీ లేదా కోర్టు జోక్యంతో అవి సమసిపోయే వి. కోర్టులు ఎలా చెబితే అలా నడుచుకుంటా ఎందుకు ఇటు ఎన్నికల కమిషన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండేవి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కోర్టులు మధ్యవర్తిత్వం చెడిపోయినా… ఏకసభ్య బెంచీలు తీర్పు ఇచ్చినా… పూర్తిస్థాయి బెంచీలు ఆదేశాలు వచ్చిన ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు ఎన్నికల కమిషనర్గా ని తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తిగా వ్యక్తిగత గొడవగా జగన్ వెర్సెస్ నిమ్మగడ్డ గా మారిన ఈ అంకంలో ఇప్పుడు వ్యవస్థలు కూడా వేలు పెట్టడం… ఇది పూర్తిగా ఎటు వెళ్తుంది అన్నది తెలియకపోవడం దేశం మొత్తం మీద నిన్న న్యాయనిపుణులను ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తోంది.

ఎం చేయనున్నారు??

ఎన్నికల కమిషనర్ కు అనుకూలంగా ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు పూర్తిస్థాయి బెంచ్ గురువారం తీర్పు ఇచ్చింది… అయితే ఇక్కడితోనే ఈ వివాదంలో అసలైన ఆట మొదలైనట్టు… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత ఉద్యోగ సంఘాలు, అధికారుల సంఘాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఎదురు తిరిగి తాము ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని చేబితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏం చేయగలరు?? దీనిపై మళ్లీ కోర్టుకు ఎక్కుతారు. అయితే జగన్ ఆలోచన కూడా ఇదే. ఎన్నికలు ఏదోలా ఎలాగోలా కచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం అయిపోయిన వరకు సాగదీసి ఆయన పదవీ కాలం అయిపోయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అన్నది జగన్ అభిమతం. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో తన వాదనలు వినిపించిన తర్వాత ఎలాగూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశమే ఉంది. దీని తర్వాత మరోసారి రాష్ట్ర ఉద్యోగ సంఘాలు పోలీసులు అధికారులు సంఘాలు వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి తాము విధుల్లో పాల్గొనబోమని… ప్రస్తుత కరుణ సమయంలో టీకాలు వేస్తున్న సమయంలో తమ సిబ్బందిని ఇవ్వలేము అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల కమిషనర్ కు చెబుతుంది. దీనిపై మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోర్టు గడుప తొక్కుతారు. సో కాబట్టి ఫిబ్రవరి నెల పూర్తయ్యేవరకు దీన్ని ఎలాగోలా సాగడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యం.

అరుదైన కేసుగా…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు రాష్ట్రప్రభుత్వాలకు మధ్య గొడవ జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో కర్ణాటక పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ కు మధ్య పలురకాల వివాదాలు జరిగాయి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వివాదానికి పోలినదే కర్ణాటక లో జరిగిన వివాదం. అక్కడి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలను వాయిదా వేయాలని కోరగా దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంగీకరించలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టు గడప తొక్క గా హైకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉంటుందని తీర్పు చెప్పింది. అలాగే పశ్చిమ బెంగాల్లో సైతం ఇలాంటిదే వివాదం వచ్చినప్పుడు స్థానిక ఎన్నికల సంఘానికి పూర్తిస్థాయి అధికారం ఉంటుందని తీర్పు వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న వివాదం మాత్రం దీనికి భిన్నం. ఈ వివాదంలోకి ఉద్యోగ సంఘాలు రాష్ట్ర అధికారులు అంతా వచ్చారు. శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు సైతం తాము ఎన్నికలు నిర్వహించాలంటూ చెప్పడం విశేషం. అంటే వ్యవస్థలన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ప్రత్యార్థులు అయ్యాయి. ఇలాంటి పరిస్థితి మాత్రం గతంలో వివాదాలు జరిగిన రాష్ట్రాల్లో కనిపించలేదు. రాత్రి వ్యవస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే వ్యవస్థలు నడుచుకోవడం అనేది పద్ధతి. ఎన్నికల కమిషనర్ కు కేవలం ఎన్నికల విధుల్లో మాత్రమే నిర్వహించాల్సిన ఉద్యోగ సంఘాలు తర్వాత మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఆడమ్ అన్నట్లే వ్యవస్థలన్నీ ఆడుతున్నాయి. అంటే ఎన్నికల కమిషనర్ కు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా దానిని అమలు పరచలేమని… ఉద్యోగ సంఘాలు చెప్పేందుకు అవకాశం ఉంది. ఇది కొత్త సంక్షోభానికి న్యాయవ్యవస్థలోని కొత్త విషయాలకూ దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ కేసులో అసలు ఎలా ముందుకు వెళ్తారు ఏ తీర్పు వస్తుంది కోర్టు ఎలా స్పందించబోతున్నాయి.. ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నాయి అన్నది… భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశం చేయనుంది. దీంతో ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న న్యాయపరమైన అంశం అయింది.

author avatar
Comrade CHE

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!