Eatela Rajendar: కేసీఆర్ కు ఈట‌ల రాజేంద‌ర్ టైం ఇస్తున్నారా?

Etela Rajendar Comments: about CM KCR
Share

Eatela Rajendar: తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అదినేత కేసీఆర్ విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత ఈట‌ల రాజేంద‌ర్ వైఖ‌రి ఏంటి? త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం విష‌యంలో ఆయ‌న ఏ విధంగా స్పందిచ‌నున్నారు? త‌న‌పై ఎవ‌రు కుట్ర చేస్తున్నారో తెలుసు అంటూనే త‌్వ‌ర‌లో అన్ని విష‌యాల‌పై మాట్లాడుతాన‌ని చెప్ప‌డం ద్వారా , ప‌రోక్షంగా ఆయ‌న సిగ్న‌ల్స్ ఇస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఈట‌ల ఏమంటున్నారు?

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆయన పదవి నుంచి తప్పించారు. ఆయన నిర్వర్తిస్తున్న ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు బదలాయిస్తున్నట్లు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ సిఫారసులను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. సీఎం సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. గవర్నర్ ఉత్తర్వులతో ఆరోగ్య శాఖ సీఎం చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఈటల.. ఏ శాఖ లేని మంత్రిగా ఉన్నారు.

ఈట‌ల ఏమంటున్నారంటే….

ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోమారు త‌న కేంద్రంగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై రియాక్ట్ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిజనిర్ధారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు. తన భూముల పక్కన అసైన్డ్ ల్యాండ్స్ ఉన్న మాట వాస్తవమేనని.. అయినా కూడా ఒక్క ఎకరా భూమి కూడా తన కబ్జాలో లేదని ఆయన అన్నారు. తాను భూకబ్జా చేశానంటూ తమ పార్టీ పత్రిక, టీవీలో రావటం బాధాకరమని ఆయన వాపోయారు. తెలంగాణ ప్రజలు గొర్లు, ఎడ్డివాళ్లనుకుంటే పొరపాటేనని ఆయన అన్నారు. డబ్బులిచ్చి తనపై ఆరోపణలు చేయించినవాళ్లు ఎవరో మున్ముందు బైటపడుతుందని ఆయన అన్నారు. నయీం లాంటి వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తేనే భయపడని తాను.. ఇలాంటి ఎంక్వైరీలకు భయపడేది లేదని మంత్రి ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు.


Share

Related posts

కుప్పకూలిన ఆనకట్ట : 9మంది మృతి

somaraju sharma

Honda Africa twin adventure bike : హోండా సరికొత్త బైక్ ఫీచర్స్ చూసేయండి..

bharani jella

రాముడిపై పుస్తకం రాసినందుకు కేసు

Siva Prasad