Eatela Rajendar: ఈట‌ల ఎపిసోడ్‌తో ఇరుకున ప‌డిపోయిన ర‌ఘురామరాజు

Share

Eatela Rajendar: వైఎస్ఆర్‌సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సంచ‌ల‌నాల ప‌రంప‌ర ఇంకా కొన‌సాగుతూనే ఉంది. సొంత పార్టీ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు, ప్ర‌భుత్వం కేసులు పెట్టడం, అరెస్ట్ తో జైలు పాల‌వ‌డం, ఆస్ప‌త్రిలో చికిత్స పొంది బెయిల్ పై విడుద‌ల‌, అయినా త‌గ్గ‌ని దూకుడు… ఇలా ర‌ఘురామ‌రాజు ట్విస్టులు కొన‌సాగిస్తున్నారు. తాజాగా, ఆయ‌న కామెంట్ల కంటే, ఎంపీ సీటుపై అనర్హ‌త వేటు హాట్ టాపిక్ అయింది. అయితే, ఈ స‌మ‌యంలోనే అధికార పార్టీ ఆయ‌న్ను కొత్త‌గా టార్గెట్ చేస్తోంది.

Read More: Eatela rajendar: ఈట‌ల చేసిన ప‌నికి కేసీఆర్ టెన్ష‌న్ ప‌డ‌పోతున్నారుగా


ర‌ఘురామ దూకుడు..
లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు  స‌మావేశ‌మ‌య్యారు. తనపై జ‌రిగిన‌ దాడి విషయంలో త‌గు చ‌ర్య‌ల కోసం ప్రివిలేజ్‌ కమిటీ సమావేశాన్ని వెంట‌నే ఏర్పాటు చేయాలని కోరిన ర‌ఘురామ సంబంధిత బాధ్యులైన‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. వైసీపీ వెబ్‌సైట్‌లో ఎంపీల జాబితాలో నుంచి తన పేరును తొలగించడాన్ని స్పీక‌ర్ వ‌ద్ద‌ ఎంపీ రఘురామ ప్రస్తావించిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా వైసీపీ చేసిన అనర్హత వేటు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని స్పీకర్కు ఈ భేటీకి ముందే రఘురామ లేఖ రాశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్ర‌కారం త‌నపై చర్యలు తీసుకోవద్దని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు తెలుస్తోంది.

Read More: Eatela Rajendar: కేసీఆర్ కు అదిరిపోయే షాక్ రెడీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్

వైసీపీ ఏమంటుందంటే…
మ‌రోవైపు అధికార వైసీపీ మాత్రం ర‌ఘురామ‌రాజుపై భ‌గ్గుమంటోంది. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాతో స‌మావేశంపై వైసీపీ పార్ల‌మెంట్ చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ స్పందించారు. రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం స్పీక‌ర్‌ బర్తరఫ్ చేయడం తథ్యం అని భ‌ర‌త్ తెలిపారు. ఆర్టికల్ 10 ప్రకారం నరసాపురం ఎంపీపై చర్యలు త‌ప్ప‌వ‌ని పేర్కొన్న భ‌ర‌త్ ర‌ఘురామ స్పీక‌ర్‌ను క‌లిసినంత మాత్రం చేత ఆయ‌న‌పై బ‌ర్త‌ర‌ఫ్ నిలిచిపోద‌ని వెల్ల‌డించారు. తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ లాగా రఘురామకృష్ణరాజుకు పౌరుషం ఉంటే రాజీనామా చేయాల‌ని సంచ‌ల‌న‌ డిమాండ్ చేశారు. రఘురామ రాజీనామా చేసి పోటీ చేస్తే ఆయ‌నకు డిపాజిట్ కూడా రాద‌ని భ‌ర‌త్‌ ఎద్దేవా చేశారు.


Share

Related posts

రవితేజ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు.. ఇది గత చిత్రాల అనుభవమేనా ..?

GRK

మాస్కులు వద్దంటున్న అమెరికా అధ్యక్ష్యుడు..! ట్రంప్ బాధేమిటి అసలు?

arun kanna

KCR : కేసీఆర్ నిర్ణయం వెనుక ఇంత సీన్ ఉందా..!? నిఘా నివేదిక చెప్పిన నిజాలివే..!?

Yandamuri